లులు గ్రూపు.. చంద్రబాబు హయాంలో విశాఖపట్నంలో ఓ పెద్ద షాపింగ్ మాల్ పెట్టాలనుకుంది. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగిట్టున్నాయి. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు జగన్ సర్కారు వచ్చింది. ఆ లులు గ్రూప్ ప్రాజెక్టు మూలన పడింది. ఇక ఏపీలో లులు గ్రూపు వచ్చే అవకాశమే లేదు.

 

అయితే.. ఎందుకు ఇలా జరిగింది. ఓ మంచి ప్రాజెక్టు వస్తుంటే జగన్ ఎందుకు అడ్డుకుంటున్నాడు..? అసలు చంద్రబాబు హయాంలోనే లులు గ్రూపు ఎందుకు షాపింగ్ మాల్ కట్టలేదు. ఎక్కడ ఆలస్యం జరిగింది. అంతేనా.. ఇంకా ఏమైనా లాలూచీ వ్యవహారాలు ఉన్నాయా.. ? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. అప్పట్లో చంద్రబాబు టీమ్ లో ఉన్న ఓ ఎంపీ ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపెట్టబోతున్నాడు. ఆయనకు ఎలా తెలుసంటే.. ఆయనది విశాఖ ప్రాంతమే కాబట్టి.

 

మరి ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నాడంటే.. ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి. ఇంతకీ ఆ నేత ఎవరంటారా.. ఆయనే మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర సేపు జగన్ పాలనలో ఏపీ ఎలా వెనుకబడిందో విమర్శించారు కదా.. ఇప్పుడు వైసీపీ దానికి కౌంటర్లు ఇస్తోంది. వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

 

" విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దిగి నోవాటెల్‌ హోటల్‌లో మీటింగ్‌ పెట్టి ఫొటోలు దిగి వెళ్లిపోవడం, లులూ గ్రూపు లాలూచీ, డేటా సెంటర్ల లాలూచీ మాకు తెలియదా..? ఐటీ కంపెనీ పెట్టిన వారికి కన్సేషన్‌ ఇస్తానని అన్నాడు.. ఎగ్గొట్టాడు.. మరోసారి ప్రెస్‌మీట్‌ వారితో పెట్టిస్తాను.. వాస్తవాలు తెలుస్తాయి.. అంటూ ట్రైలర్ వదిలారు. మరి ట్రైలర్ ఇలా ఉంటే.. సినిమా ఇంకెలా ఉంటుందో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: