రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి మొదలుకుని నేటి వరకు అమరావతినే  రాజధానిగా  కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు . అయితే అదే...  అమరావతి ప్రాంతానికి చెందిన మరికొంతమంది రైతులు తమకు రాజధాని వద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం హాట్ టాఫిక్ గా మారింది . ముఖ్యమంత్రి తో భేటీ అనంతరం కొంతమంది రైతులు మీడియా తో మాట్లాడుతూ తమకు రాజధాని వద్దని , తమ ప్రాంత అభివృద్ధే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు .

 

రాజధాని కోసం తాము ఎంతెంత భూములిచ్చిమో కూడా వివరించారు . ఇక రాజధాని వద్దంటున్న రైతులు, అసెంబ్లీ లో ముఖ్యమంత్రి ప్రకటించిన ప్యాకేజికి  మాత్రం జైకొట్టారు . అయితే మరికొంతమంది రైతులు మాత్రం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ , ఉపరాష్ట్రపతి తోపాటు , కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెల్సిందే . దీనితో ఇప్పటి వరకు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఏకతాటిపైకి వచ్చి  ఉద్యమించిన రైతుల్లోను చీలిక వచ్చినట్లు స్పష్టం అవుతోంది . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రతిపాదన తెర పైకి తెచ్చిన నాటినుంచి అమరావతి ప్రాంత రైతులు, రాజకీయ పార్టీల తో నిమిత్తం లేకుండా  ఆందోళనలు , నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెల్సిందే .

 

ఇన్నాళ్లు ఏకతాటిపై ఉండి,  అమరావతి నే రాజధానిగా   కొనసాగించాలని ఉద్యమించిన రైతుల్లో ఉన్నట్టుండి , ఈ చీలిక కు కారణమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు . అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను  రాష్ట్ర ప్రభుత్వం ఒకొక్కటిగా తరలిస్తున్న సమయం లో , హైకోర్టు తీవ్రంగా ఆక్షేపిస్తుంటే ... రాజధాని రైతుల్లో వచ్చిన చీలిక వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉండి ఉంటుందన్న అనుమానాలు లేకపోలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: