తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆషామాషీగా అయితే ఆయన ఏ వ్యవహారాలు చేయడు. పక్కా వ్యూహంతో తమ రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడం లో కెసిఆర్ బాగా ఆరితేరి పోయాడు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయకుండానే అద్భుతమైన ఫలితాలను సాధించి తిరుగులేని రాజకీయ నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన తెలంగాణలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ సభను కెసిఆర్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ లోని కొంగరకొలాన్ ప్రాంతాన్ని ఇప్పటికే టిఆర్ఎస్ నాయకులు సందర్శించి కెసిఆర్ కు నివేదిక పంపినట్లు తెలుస్తోంది.


 గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇక్కడ టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. సుమారు 40 వేల మంది నాయకులు ఈ సభ ద్వారా ఒక చోటకు చేర్చాలని, వీరందరికీ కొత్త మున్సిపల్ యాక్ట్ గురించి సవివరంగా కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సభ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం కూడా తెలంగాణ రెవెన్యూ చట్టం గురించే ఉండబోతుందట. ఈ సభకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్ లు, జెడ్పిటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు ఈ సభకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.


 తెలంగాణలో రాబోతున్న కొత్త మున్సిపల్ చట్టం కఠినంగా ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. అవినీతిలో మొదటి స్థానంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కెసిఆర్ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ కొత్త చట్టం గురించి పూర్తిస్థాయిలో వివరించి సభను సక్సస్ చేయడం ద్వారా పార్టీలోనూ... ప్రజల్లోనూ కొత్త ఉత్సాహం రేకెత్తించాలని  కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: