ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు  రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతి లో రైతులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చామని ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని మారుస్తామంటే  తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆరోపిస్తూ నిరసనలు  తెలుపుతున్నారు. ఇకపోతే తాజాగా అమరావతి రైతులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండవెల్లి శ్రీదేవి లతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు అమరావతి రైతులు. 

 

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు అమరావతి రైతులు. అయితే ఈ సమావేశంలో అమరావతి రైతులందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... సమావేశంలో చర్చించిన అంశాలపై వివరించారు. రాజధాని భూములు సేకరణ నోటిఫికేషన్ ను  ఉపసంహరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆదేశించారని తెలిపిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... సీఎం జగన్ ప్లేస్లో మరెవ్వరు ఉన్న ఇంత త్వరగా నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదేమోనని తెలిపారు. 

 

 

 

 అక్విజిషన్ ఎత్తివేస్తే రైతుల పొలాలకు వెంటనే నీళ్లు వస్థాయని... వారు వ్యవసాయ పనులు ప్రారంభించే వీలు ఉంటుందని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు అంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. నమ్మశక్యం కాని విదంగా  రైతులు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.. వెంటనే రైతుల పక్షాన వేగంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కొనియాడారు. జగన్ కేసులో మరెవ్వరు  ఉన్న రేపు మాపు అని వాయిదా వేసే వారని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రిజర్వు జోన్లని  కూడా ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. రైతులకు పంట పండించుకునే హక్కు ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో తెలిపారు అంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వచ్చారు. తమ వద్ద నుంచి బలవంతంగా భూసేకరణ చేశారు అంటూ అమరావతి రైతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: