పెద్ద కంపెనీలో  పెద్ద జాబులో  కొనసాగుతున్నప్పుడు ఎంతో హుందాగా ఉండాలి. హుందాతనం లేదు అంటే గౌరవం దక్కదు కొన్ని కొన్ని సార్లు ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడో వ్యక్తికి అలాంటిదే జరిగింది. యూరోప్లో బ్యాంకింగ్ లావాదేవీలతో అత్యధిక లాభాలు గడుస్తూ టాప్ లో కొనసాగుతున్న సిటీగ్రూప్ బ్యాంకులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు పరాష్ షా . అయితే మేనేజర్ హోదాలో ఉండి  చిల్లర వేషాలు వేయడంతో బంగారంలాంటి ఉద్యోగాన్ని తొలగించారు. ఇంతకీ ఈ వ్యక్తి జీతం ఎంత అనుకుంటున్నారు... ఏకంగా  సంవత్సరానికి 9.30 కోట్లు. అయితే తొమ్మిదిన్నర కోట్ల రూపాయల జీతం అందుకుంటున్న ఈ వ్యక్తి లండన్ లోనే కానరీ వార్ప్ లో  బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి తరచూ ఆహారాన్ని దొంగలిజేస్తూన్నాడట  . 

 

 

 చాలాసార్లు శాండ్విచ్ దొంగలించారు. ఇలా కొంతకాలం వరకు శాండ్విచ్లు పలు ఆహార పదార్థాలను దొంగలించగా  ఈ విషయాన్ని గ్రహించిన యాజమాన్యం.. వెంటనే అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసినట్లు ఫినాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి ఫరజ్  షాకే సెలవుల్లో  వివిధ దేశాల్లో పర్యటించే  అలవాటు ఉందని... అతని యొక్క ఫేస్బుక్ పేజీలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ వ్యక్తి పెరులోని మాచుపిచ్చు  పర్యాటక కేంద్రాలు ఎక్కువగా సందర్శించినట్లు అయిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మధ్య యూరప్ తో పాటు మధ్య ప్రాచ్యం ఆఫ్రికా బ్యాంకింగ్ కార్యకలాపాలకు వేదికగా వ్యవహరిస్తున్నారు ఈ వ్యక్తి. 

 

 

 మరి ఇలాంటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి... చీప్ గా శాండ్విచ్ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉద్యోగానికి కోల్పోవడం చూసి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇలా  ఆహరం  కోసం కక్కుర్తి పడి జాబ్  పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కోట్లు కుమ్మరించి జీవితం... గౌరవప్రదమైన హోదా... ఇలాంటివి అన్ని ఉన్నప్పుడు శాండ్ విచ్  కోసం దొంగతనం లాంటి చిల్లర  చేయడం అనేది నిజంగా అందరూ ఆశ్చర్య పోవాల్సిన పనే.

మరింత సమాచారం తెలుసుకోండి: