బీజేపీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది అయిన రఘునందన్ రావు పై ఆర్సి పురం గ్రామానికి చెందిన రాధా రమని  అనే మహిళ చేసిన ఆరోపణలు సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఓ కేసు నిమిత్తం రఘునందన్రావు దగ్గరికి వెళ్తే కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది . అంతేకాకుండా తన వద్ద నగ్న చిత్రాలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసి ఎన్నోసార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది సదరు మహిళ. అయితే ఈ మేరకు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. అంతేకాకుండా ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ రాజా రమని  చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

 

 

 అంతేకాకుండా రఘునందన్ రావు బ్లూ ఫిలిమ్స్ కూడా సప్లె  చేస్తుంటారని... తన వద్దకు కేసుల పరిష్కారం కోసం వచ్చిన మహిళలు బెదిరించి లొంగతీసుకుని అత్యాచారాలకు పాల్పడతాడు  అంటూ ఆరోపించింది సదరు బాధిత మహిళ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బాధిత మహిళ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తాజాగా ఓ మీడియా చానల్ తో మాట్లాడిన బిజెపి అధికార ప్రతినిధి న్యాయవాది రఘునందన్ రావు... రాధా రమణి  చేస్తున్న ఆరోపణలు నూటికి నూరు శాతం అవాస్తవాలు అంటూ తెలిపారు. ఇప్పుడు వరకు తనకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాను ఏ నేరం చేయలేదని ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలియదు అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. 

 

 

 పూర్తి వివరాలు తెలుసుకుని దీనిపై స్పష్టత ఇస్తాం అంటూ రఘునందన్రావు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ రోజు మీడియాతో మాట్లాడిన బాధిత మహిళ రాధారమని... తన దగ్గరకు కేస్ కోసం వచ్చే మహిళలతో బ్లూ ఫిలిం చేసి ఎంతో మంది రాజకీయ నాయకులకు పంపిస్తాడు అంటూ రఘునందన్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త రఘునందన్రావు కలిసి తనను  కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారంటూ ఆరోపించింది. అంతేకాకుండా తనకు తన కొడుకుకి ప్రాణభయం ఉందని మాకు రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు . కాగా  రాధా రమని  చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: