సంస్కారం లేకుండా మాట్లాడితే జనం హర్షించరని టీడీపీ మహిళానేత. ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. జబర్దస్త్‌ వేషాలను జనం ఆదరించరని ఎమ్మెల్యే రోజా తెలుసుకోవాలని హితవు చెప్పారు. రాజధాని మహిళల్ని చూసైనా రోజా తన పద్ధతి మార్చుకోవాలన్నారు. శాసనమండలిసభ్యులను దద్దమ్మలన్న రోజాకు ఎంత విజ్ఞత ఉందో ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.  ఎలాంటి సంస్కారం ఉందో తేలిపోయిందన్నారు.  ఆమె వ్యాఖ్యల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రజలందరికి స్పష్టమవుతోందన్నారు.  

మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు, పెద్దల సభలోని వైసీపీ సభ్యులు కూడా దద్దమ్మలేనా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. మంగళవారం ఆమె మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.మండలి సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి తాళం కొట్టడంలేదనే సభను రద్దు చేయడం జరిగిందన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయడాన్ని వ్యతిరేకించామన్నారు.

 తెలుగు బోధనను అమలు చేయాలని సూచించామనే రాష్ట్ర ప్రభుత్వం మండలిపై కక్షపెంచుకుందన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడే వారి గురించి, తాము సంస్కారహీనంగా మాట్లాడలేమన్నారు.  జబర్దస్ట్‌ వేషాలను జనం ఆదరించరనే విషయాన్ని రోజా తెలుసుకోవాలన్నారు. మహిళల ఆందోళనలను సాటి మహిళగా ఉండి హేళన చేయడం తగదన్నారు. ఎమ్మెల్యేగా ఉండి, ఎమ్మెల్యేలను కించపరచడం సముచితం కాదన్నారు. తెల్లరేషన్‌కార్డులున్నవారంతా అమరావతి చుట్టుపక్కల భూములుకొన్నారని, వారంతా తెలుగుదేశం బినామీలని దుష్ప్రచారం చేస్తూ, టన్నులకొద్దీ బురద ప్రతిపక్షంపై చల్లాలని జగన్‌ ఆయన మీడియా ప్రయత్నించ డం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని కుటుంబాలకంటే తెల్లరేషన్‌కార్డుదారులే ఎక్కువగా ఉన్నారని  చెప్పారు

ప్రజల పక్షాన వారి ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నవారిని తూలనాడటం ఆమెకు మంచి పద్ధతి కాదన్నారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సంధ్యా రాణి మాట్లాడుతూ, రోజా మాట్లాడే విషయాలను పట్టించుకుంటూ పోతే, రోజూ ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. మగ పోలీసులు తిడుతున్నా, కొడుతున్నా ఓర్చుకుంటూ, రాజధాని మహిళలు చేస్తున్న పోరాటం, వారి మాట తీరు చూసైనా రోజా తన పద్ధతి మార్చుకోవాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: