మొన్నటి వరకు బాబుకు వంత పాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే భారతీయ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలో టీడీపీని పవన్ దూరం పెట్టేసారు. ఇక చంద్రబాబు ముగ్గురం కలిసి వెళ్లుదామ అని చేసిన ప్రయత్నం ఫలించలేదు.. అయితే ఏపీ రాజధాని విషయంలో అమరావతి గొడవ కేంద్రం దాక వెళ్లింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్‌ ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.

 

 

మండలిలో లొల్లి లేకుంటే ఇప్పటికే ఏపీకి మూడు రాజధానులు అయ్యేవి. ఇక ప్రస్తుతానికి మండలిలో బిల్లు సెలక్షన్‌ కమిటీకి వెళ్లిన కారణంగా మూడు రాజధానుల ఏర్పాటు ఆగింది. కాని జగన్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. నేడు కాకుంటే రేపు అయినా కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటూ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజధాని విషయమై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వచ్చే తరాలు ఎప్పటికి మిమ్మల్ని క్షమించవు  ఎందుకంటే మూడు రాజధానుల విషయంలో ఏ ఒక్కరు కూడా సానుకూలంగా లేరని, ప్రభుత్వం ఒంటెద్దు పోకడతోనే ఇలాంటి పనులు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

 

ఇదిలా ఉండగా అమరావతి రైతులు రాజధాని విషయంలో చేస్తున్న గొడవను ఇక్కడ జనసేన పార్టీ గాని, ఏపీలో ఉన్న బిజేపీ గాని వారితో మాట్లాడి ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియ చేయాలి కాని వీరేమి పట్టించుకోనట్లుగా ఉండటంతో ఈ చర్యనంతా వెనక నుండి బాబు నడిపించారు. ఇప్పుడు ఏపీ పెద్దలు ఢిల్లీ వెళ్లి అక్కడి కేంద్ర పెద్దలను కలిసి విషయం వివరించారు..

 

 

కాగా ఏపీలో బిజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన బిజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఈ విషయంలో వీరిద్దరు పెద్దరికం తీసుకోవాలి గాని ఇదేమి జరుగకుండా చంద్రబాబు డైరెక్ట్‌గా ఈ ఇద్దరికి జలక్ ఇచ్చి విషయాన్ని నేరుగా ఢిల్లీ వరకు తీసుకెళ్లాడు.. ఈ విషయంలో ఒకరకంగా ఏపీలో జనసేన, బిజేపీకి బలం లేదని సృష్టం అవుతుంది. దీంతో కేంద్రం దృష్టిలో వీరు చులకనగా మారారని విశ్లేషకులు అనుకుంటున్నారట....

మరింత సమాచారం తెలుసుకోండి: