ఇప్పుడంటే రాజధాని అమరావతి కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు కానీ.. గత ఐదేళ్లూ తమను చంద్రబాబు, లోకేశ్ వేధించారని కొందరు అమరావతి ప్రాంత రైతులు అంటున్నారు. వారు సీఎంను కలసి నారా లోకేశ్ లీలలను వివరించారు. గత ఐదేళ్లలో మా జీవితాలు మేము బతకనివ్వండి అని చంద్రబాబును వేడుకున్నా కూడా వినలేదని సీఎం జగన్ కు తెలిపారు.

 

రాజధానితో మాకు సంబంధం లేదు. అభివృద్ధే ముఖ్యమని రాజధాని ప్రాంతవాసులు కోరుకోవడంతో సీఎం వైయస్‌ జగన్‌ అందుకు సంపూర్ణంగా ఒప్పుకున్నారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలకు మోడల్‌ మున్సిపాలిటీలుగా చేసేందుకు రూ.1200 కోట్లు కేటాయించారు. 2014లో ఎమ్మెల్యే ఆర్కే, వైయస్‌ జగన్‌కు అండగా ఉన్నామని చంద్రబాబు ఐదేళ్లలో మా గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదని రైతులు గుర్తు చేశారు.

 

ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు కొడుకు లోకేష్‌ను ఓడించామని రైతులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. ల్యాండ్‌ ఫూలింగ్‌ వాలంటరీ అని చెప్పిన చంద్రబాబు తన రూట్‌ మార్చారు. చంద్రబాబు చేస్తున్న రాజధాని కాదు..రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములు తీసుకుంటామని చంద్రబాబు చెప్పి..ఆ తరువాత ల్యాండ్‌ ఎ‌క్విజేషన్‌ పేరుతో బలవంతంగా తీసుకోవడాన్ని తాము వ్యతిరేకించాం. రైతులను చంద్రబాబు బెదిరించారని ఆర్కే తెలిపారు.

 

చంద్రబాబు, లోకేశ్ అక్రమ కేసులు పెట్టారు. పంటలను తగులబెట్టారు. ఆ రోజుల్లోనే వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటాలు చేశాం. మేం కోరుకున్నట్లుగా రాజన్న రాజ్యం వచ్చింది. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యారు. మేం కోరుకున్నట్లుగా మా జీవితాలు బాగుపడేందుకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు బాగుంటున్నాయి. చంద్రబాబు చేసిన అక్రమాలు, అన్యాయాలను సీఎం ముందుంచాం. మంగళగిరిలో రోడ్లు ఏర్పాటు చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.మూడు నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని సీఎం మాటిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం వైయస్‌ జగన్‌కు రైతులు ధన్యవాదాలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: