క్రికెట్ అంటే ఎంతో మందికి ఇష్టం... అయితే క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది అభిమానులుగా మిగిలిపోతే కొంత మంది ఆటగాళ్లు గా మారడానికి ముందుకు కదులుతారు. తామేంటో నిరూపించుకోవడానికి నిరూపించుకోవాలని శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాడీలోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేసిన వారు క్రికెట్ లో ఆడుతుండటం ఒక ఎత్తయితే... వికలాంగులు క్రికెట్ ఆడి అద్భుత ప్రదర్శన చేయడం ఒక ఎత్తు. ఇక్కడో క్రికెటర్ అలాంటి అద్భుత ప్రదర్శన చేశాడు... కానీ ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో ప్రాణానికి ప్రాణమైన క్రికెట్ వదిలేసి  దోసెలు వేసుకుంటూ బతుకు వెల్లడిస్తున్నాడు. ఆయనే తిరుప్పాపులి  దేవరాజు... ఈయన పేరు దివ్యాంగుల క్రికెట్లో తెలియని వారుండరు. 

 

 

 చిన్నప్పుడే నాటువైద్యం కారణంగా ఒక కాళ్లు చచ్చుబడిపోయింది ... అయినప్పటికీ క్రికెట్ మీద మక్కువ తగ్గలేదు... కుంటి  వాడివి నువ్వే క్రికెట్ ఆడుతావు అని అందరూ హేళన చేసినప్పటికీ దృఢమైన సంకల్పంతో ముందుకు సాగాడు.. కడప జిల్లా రామాంజనేయ పురానికి చెందిన దేవరాజు వికలాంగుల క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందాడు. అయితే చిన్నప్పుడు నాటువైద్యం కారణంగా కాలు చచ్చుబడి పడిపోవడంతో నువ్వు వికలాంగుడి వి క్రికెట్ ఆడలేవు  అని ఎంతమంది హేళన చేస్తున్న క్రికెట్ పై మక్కువతో ముందుకు సాగాడు దేవరాజు. 1993 94 సంవత్సరంలో వికలాంగుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు అని తెలిసి అక్కడికి వెళ్లి పాల్గొని ప్రతిభ చాటాడు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. 

 

 

 

 ఆ తర్వాత ప్రతిభ కనబరుస్తూ జాతీయస్థాయి వికలాంగుల క్రికెట్ జట్టుకి  కూడా ఎంపికయ్యాడు ఏకంగా ఉత్తమ బౌలర్గా సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి మొదలైన దేవరాజు ప్రస్థానం అందరకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అయితే వికలాంగుల క్రికెట్ కి బీసీసీఐ  గుర్తింపు కోసం ఎంతగానో ఎదురు చూశాడు కానీ బిసిసిఐ వికలాంగుల క్రికెట్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ... తాను వికలాంగుల క్రికెట్లో గెలుచుకున్న సర్టిఫికెట్లు ఏ  ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో పనికి రాకపోవడంతో... కుటుంబ పోషణకు క్రికెట్ ను పక్కకు పెట్టేసాడు. బ్యాట్  పట్టిన చేతితో దోషలు వేస్తూ... బౌలింగ్ వేసిన చేతులతో వడలు వేస్తూ ప్రస్తుతం బతుకు బండి వెళ్లదీస్తున్నారు. తాను కొన్ని సంవత్సరాల పాటు క్రికెట్ లో ప్రతిభ కనబర్చినని... తను పదో తరగతి చదువుకున్నాను అని చిన్న స్థాయిలో అయినా సరే ఉద్యోగం చూపించండి అంటూ అధికారులను వేడుకుంటున్నాడు దేవరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: