దేశ భద్రత విషయంలో భాజాపా గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని సార్లు పరిమితుల్ని మించుతున్నాయనే వాదన వినిపిస్తుంది.  అయితే భద్రత గురించి ఎవరూ కాదనరు. కానీ వాటికి పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుందని భావిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మొన్నటికి మొన్న రాఫెల్ విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం. రాఫెల్ యుద్ధ విమానాలని కొనడానికి ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా, అవి కొన్న తీరు అగ్రిమెంటులొ కుదుర్చుకున్న ఒప్పందాలు మేధావులని ప్రశ్నించేలా చేశాయి.

 

 

అయితే ప్రస్తుతం మరో అంశం కూడా అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. దేశ కీలక నేతలైన ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ల ప్రయాణానికి ప్రత్యేక విమానాన్ని తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. రెండు బోయింగ్ వైడ్ విమానాలని రూపాయలు 8548 కోట్ల ఖర్చుతో అత్యాధునికమైన హంగులతో నిర్మిస్తున్నారణి తెలుస్తుంది. ఈ రెండు విమానాల్లోనే మన నేతలు విదేశీ పర్యటనలకి వెళ్తారని చెప్తున్నారు.

 

 

ప్రస్తుతం దేశ ప్రధానికి ప్రత్యేక విమానం ఉన్నప్పటికీ, మరింత భద్రత కోసం, అత్యాధునాతమైన హంగులతో మన దేశ ప్రగతి ఇనుమడింపజేసేలా, రక్షణలో ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు ఈ విమానాలని తయారు చేయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే అంత ఖర్చు పెట్టి రెండు విమానాలు అవసరమా, వాటి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు కదా అనే వారు కూడా ఉన్నారు. దేశ బడ్జెట్ విడుదల చేసిన నేపథ్యంలో రెండు విమానాలకి ఇంత ఖర్చు అవసరమా అన్న వాదన ఎక్కువవుతోంది.

 

 

అయితే దీనికి ఎవరి వాదన వారికుంది. దేశాన్ని రిప్రజెంత్ చేసేది దేశాధినేతలే కాబట్టి వారి రక్షణ విషయంలో ఆ మాత్రం ఖర్చు పెట్టడం కరెక్టేనని వాదిస్తున్నారు.  వేరే దేశానికి వెళ్ళేటపుడు ఆ మాత్రం రక్షణ ఉన్న విమానాలని వాడటం మంచిదే అని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: