చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ దేశాలకి కూడా వ్యాపిస్తోంది. ఇప్పటికే చైనాలో ఉన్న భారతియులని ఆగమేఘాల మీద ఇండియాకి తీసుకువచ్చేస్తున్నారు. అయితే దీనికి ఇంతవరకు మందు కనిపెట్టలేదు. సరైన వాక్సినేషన్ కనుక్కోకపోవడం వల్ల వైరస్ మరింత విజృంభిస్తుంది. ఇప్పటికి అధికార లెక్కల ప్రకారం ౪౪౮ మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

 


రోజు రోజుకీ తన లక్షణాలని మార్చుకుంటున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన కనిపెట్టే పనిలో చైనా వైద్యులు, శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఎన్ని కాంబినేషన్లు ఉపయోగించినా, ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కరోనాని కనీసం తగ్గించే ప్రయత్నం చేయలేకపోయింది. అయితే చైనా చేయలేకపోయిన పనిని థాయ్ లాండ్ చేసి చూపించింది.. కరోనాని ఖతం చేసి తన సత్తా ఏంటో చూపించింది.

 

 


థాయ్ లాండ్ లోని డాక్టర్ కియాన్స్, డాక్టర్ సుక్ సయ్ అనే ఇద్దరు డాక్టర్లు కరోనా బారిన పడ్డ వ్యాధిగ్రస్తుడికి దాని నుండీ విముక్తి కలిగించారు. ౭౧ సంవత్సరాలు కలిగిన చైనా మహిళ ఈ ఇద్దరు డాక్టర్లని కలిసినపుడు, ఆమె మీద ఈ డాక్టర్లు ప్రయోగం చేయాలని భావించారు. దానికి ఆమె కూడా అంగీకరించడంతో, కరోనా లక్షణాలకి తమకి తెలిసిన వైద్యం చేసి కరోనాని ఆమె శరీరం నుండి పూర్తిగా తొలగించారు.

 

 

ఇంతకీ వారేం చేసారంటే, మాటి మాటికీ లక్షణాలు మార్చుకుంటున్న వైరస్ కి ఎయిడ్స్ కి వాడే మందుని, అలాగే ఫ్లూకి వాడే మందులని కలిపి కరోనాని ఖతం చేసి పడేసారు. అయితే ఈ మందులని ఏ మోతాదులో వాడారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆ వృద్ధురాలి శరీరం కరోనా నుండి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉందట. ఏదేమైతేనేం కరోనాని ప్రపంచం మొత్తం వణికిపోతున్న సమయంలో ఇలాంటి వార్త తెలియడం ఆనందకరమే.

మరింత సమాచారం తెలుసుకోండి: