ఒకప్పుడు బైరెడ్డి కుటుంబం జగన్ అంటేనే మండిపడేది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తరువాత గౌరు కుటుంబం నందికొట్కూరులో పట్టు సాధించడంతో బైరెడ్డి కుటుంబం ఓటమిపాలు కావాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలలో నందికొట్కూరు నియోజకవర్గం కూడా ఒకటి.                         
 
నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ఎన్నికల్లో పోటీ చేయాలన్నా సిద్ధార్థరెడ్డికి పోటీ చేసే అవకాశాలు లేవు. ప్రస్తుతం బైరెడ్డి సిద్దార్థరెడ్డి వైసీపీ పార్టీలో నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జీగా ఉన్నారు. ఎన్నికల బరిలో దిగే అవకాశం లేకపోవడంతో బాగా పట్టు ఉన్న నియోజకవర్గమే అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. నందికొట్కూరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ఆర్థర్ గెలిచారు. 
 
నందికొట్కూరు నియోజకవర్గంలో డీలిమిటేషన్ తరువాత ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ పార్టీలే ఘనవిజయం సాధించాయి. ఎన్నికల్లో ఆర్థర్ విజయం సాధించిన తరువాత నందికొట్కూరు నియోజకవర్గంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఈ అభిప్రాయ బేధాలు గత కొంతకాలం నుండి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గ ఇంఛార్జీగా ఉన్నప్పటికీ సిద్ధార్థరెడ్డికి తన మాట చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తి ఉంది. 
 
అందువలన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీ మారే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అతి త్వరలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం అందుతోంది. అధికారికంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్రకటించకున్నా బీజేపీలో సిద్దార్థరెడ్డి చేరడం మాత్రం పక్కా అనే తెలుస్తోంది. బీజేపీలో చేరితేనే తాను ఎలివేట్ అవుతానని సిద్దార్థరెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. మరి బైరెడ్డి సిద్దార్థరెడ్డి బీజేపీ పార్టీలో చేరతారో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: