మొదట చైనాలో గుర్తించబడిన కరుణ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన ఎంతోమంది కరోనా ఎన్నో  ప్రాణాలను బలిగొంటోంది. అయితే కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు చాలా మంది వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే... కొంతమంది కరోనా వైరస్ బారినపడి వెల మంది ప్రాణభయంతో బతుకుతున్నారు.. కాగా  రోజురోజుకు చైనాలో కరోనా  మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక అటు ప్రపంచ దేశాలు కూడా కరోనా వైరస్ తో బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది కూడా. మన భారతదేశంలో కి కూడా కరోనా వైరస్ వచ్చేసింది. 

 

 

 ఇప్పటికే కేరళ రాష్ట్రంలో కరోనా  వైరస్ కు సంబంధించి మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అటు భారతీయుల్లో కూడా అలజడి నెలకొంది కేరళ వరకు వచ్చిన కరోనా వైరస్ తమ రాష్ట్రం వరకూ వ్యాపించి ఎక్కడ ప్రాణాలు బలి తీసుకుంటోంది ప్రజలు ప్రాణ భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా మద్యం తాగారా లేదా అని వాహనదారులను చెక్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే బ్రీత్ అనలైజర్ ద్వారా కూడా కరోనా  వస్తుందని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ బ్రీత్ అనలైజర్ ద్వారా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

 

 

 అయితే కేరళలో ఇప్పటికే ముగ్గురికి కరోనా  సోకినట్లు నిర్ధారణ అవ్వగా... ఇంకా చాలా మంది కూడా... కరోనా  అనుమానితులు ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల్లో భాగంగా పోలీసులు ఉపయోగించే బ్రీత్ అనలైజర్ లు పై పై కూడా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ ద్వారా ప్రస్తుతం భారతదేశాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని కొన్ని రోజుల వరకు బ్రీత్ అనలైజర్ మిషన్లను వాడకండి అంటూ ప్రజలు పోలీసులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: