తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఆయన ఎక్కడైనా సభ నిర్వహించినా, మీటింగ్ పెట్టినా వేలాది, లక్షలాది మంది జనాలు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. గత కొంతకాలంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయం విమర్శలపాలవుతూ వస్తోంది. కేవలం పార్టీ నాయకుల కోసమే తెలుగుదేశం పార్టీని నడుపుతున్నట్టు గా ఆయన వ్యవహార శైలి ఉంటూ వస్తుండడంతో పాటు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకునే వారు కరువవ్వడంతో సొంత పార్టీ నాయకులతో పాటు, ప్రజల్లోనూ ఆయన వ్యవహార శైలి పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

 

నిన్న గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఒకే రాజధాని - ఒకే రాష్ట్రం పేరుతో మాజీమంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ కీలక నాయకులు అంతా హాజరయ్యారు. అయితే జనాలు మాత్రం కరువయ్యారు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమివడంతో చాలా సేపటి వరకు సభా ప్రాంగణం బోసిపోతూ కనిపించింది.దీంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన సభ జనాలు లేక పోవడంతో ఎనిమిది గంటలకు మొదలయ్యింది. 


అసహనంగానే చంద్రబాబు తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి బాబు విమర్శలు చేశారు. అమరావతిని తరలిస్తారు అనే దిగులుతో 37 మంది రైతులు మరణించారని, ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను ధర్మం న్యాయం కోసం పోరాడుతున్నానని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేసేది లేదంటూ చంద్రబాబు ప్రసంగించారు.

 

 సభలో మొత్తం జగన్ ను టార్గెట్ చేసుకుని చంద్రబాబు ప్రసంగించడం, చెప్పిందే చెప్పి బోర్ కొట్టించడంతో వచ్చినా ఆ కొద్దిపాటి జనాలు మధ్యలో నుంచి లేచి వెళ్ళి పోతూ ఉండటం టిడిపి నేతలను కలవరపెట్టింది. బాబు కూడా జన సమీకరణ సరిగా చేయలేదని సభ ఏర్పాట్లు చేసిన వారిపై రుసరుసలాడుతూ కనిపించారు. దీంతో బాబు గారు ఖాళీ కుర్చీలకే తన గోడు వెళ్లబోసుకోవాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: