వారికీ ఒక్కరు అంటే ఒక్కరు చాలా ఇష్టం. వారు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒక్కరిని విడిచి మరొక్కరు ఉండలేరు. ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుని సంతోషంగా గడపాలని చాలా కళలు కనింది. ఇద్దరు పెళ్ళిచుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాతే ఆమెకు ఘోరమైన నిజం తెలుసుకుంది. ఆమె భర్త తనకు మాయమాటలు చెప్పి ప్రేమించడాని తెలుసుకుంది. ప్రేమ ఎంత గుడ్డిదో ఆమెకు అర్ధం అయింది. ఆమెకు ఎం నిజం తెలిసింది? వారి మధ్య ఎం జరిగి ఉంటుంది? వారికీ పుట్టిన బాబుతో ఆ భర్త ఎం చేశాడు ..? 

 

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు తన భర్త కుమారేశ్ రౌడీ షీటర్ తెలిసింది. దింతో ఆమె విస్తుపోయింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వారు ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడేవారు. ఈలోపు వారిద్దరికీ బాబు పుట్టాడు. రోజు రోజుకు వారికీ గొడవలు మరింత ముదరడంతో అతడు భార్యపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల తన కొడుకును తీసుకోని బయటికి వెళ్ళాడు.  తన కుమారుడుతో కలిసి బయటకు వెళ్లిన అతడు స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. అతనికి ఎం అనిపించిందో తెలియదు కానీ పసివాడి రూపంలో తన భార్యను బాధ పెట్టాలనుకున్నాడు.

 

కన్న తండ్రి పిల్లలకు మంచి, చేడు చెపుతూ సమాజంలో మంచిగా నడిపించాలనుకుంటాడు. కానీ ఈ తండ్రి మాత్రం తన కొడుకు పసిబాలుడితో కూడా మద్యం తాగించాడు. తన పైశాచిక ఆనందం కోసం బాలుడు మద్యం తాగుతుండగా వీడియో తీశాడు. అతను తీసి వీడియోను భార్యకు షేర్ చేశాడు.  ఆ వీడియో చూసిన అతని భార్య షాక్ కి గురైంది. దింతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బెంగళూరులోని మాగడిరోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. 

మరింత సమాచారం తెలుసుకోండి: