కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పైస్ బోర్డ్ విస్తరణ గురించి నిన్న కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. స్పైస్ ప్రాంతీయ బోర్డును నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యాలయం పసుపు సహా మిగతా మసాలా దినుసుల కొరకు పని చేస్తుందని పసుపు పంట ఎగుమతుల గురించి ప్రత్యేక దృష్టితో బోర్డు పని చేస్తుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుండి ఎంపీగా అరవింద్ గెలవడానికి, కవిత ఓడిపోవడానికి పసుపు బోర్డు ప్రధాన కారణం. 
 
ఎన్నికలకు ముందు అరవింద్ తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రైతులకు మాట ఇచ్చారు. నిజామాబాద్ ఎన్నికల్లో రైతులు పెద్ద సంఖ్యలో బరిలో దిగడంతో ధర్మపురి అరవింద్ కవితపై 69,000 పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తరువాత పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడంతో ఎంపీ అరవింద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 
పసుపు బోర్డు హామీ దిశగా చర్యలు చేపట్టకపొవడంతో రైతులు కూడా ఎంపీ అరవింద్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తాజాగా కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో రైతుల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో కవిత రాజకీయ భవిష్యత్ కు అరవింద్ గండి కొట్టారని వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగా అరవింద్ గెలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఎంపీ అరవింద్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నెగ్గించుకోవడంతో ఒకరకంగా కవితకు షాక్ ఇచ్చాడనే చెప్పవచ్చు. కేంద్రం పసుపు బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు మద్దతు ధరను కూడా ప్రకటించింది. పసుపు బోర్డు ఏర్పాటు కాకపోయి ఉంటే కవితకు రాజకీయంగా ప్రయోజనం చేకూరి ఉండేది. కానీ ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుండే పోటీ చేస్తుందా...? లేదా...? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: