‘ఒక వ్యక్తి యొక్క పేదరికాన్ని కానీ సంపదను కానీ నిర్ణయించేది ఆ వ్యక్తి ఆదాయం కాదు. అతడి ఆదాయానికి ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రమే’ అంటూ ప్రపంచ ప్రముఖ ఆర్ధిక వ్యాక్త బీచర్ అభిప్రాయ పడుతున్నాడు. సంపాదన ఎంత వచ్చినా తన ఖర్చులతో సంబంధం లేకుండా ఎంతో కొంత భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న వాడు మాత్రమే ఎప్పటికైనా సంపన్నుడు కాగలుగుతాడు.

ప్రముఖ సంపద శాస్త్ర పరిశోధకుడు థామస్ స్టాన్లీ ఒక దశాబ్దానికి పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల పై చేసిన పరిశోధనలలో కొన్ని షాకింగ్ వాస్తవాలు బయట పడ్డాయి. ఖరీదైన ఇళ్ళల్లో నివసిస్తూ విలాసవంతమైన కార్లల్లో తిరిగే ప్రముఖులలో చాలామంది దగ్గర చెప్పుకో తగ్గ సంపద ఉండదనీ థామస్ అభిప్రాయ పడుతున్నాడు.

అంతేకాదు సంపద బాగా కూడబెట్టిన ధన వంతులు వారు సంపన్నులము అన్న విషయాన్ని అంగీకరించారనీ వారు సాదాసీదా జీవితాన్ని గడపడానికి మాత్రమే ఇష్టపడతారు అంటూ ఆ పరిశోధన తెలియ చేస్తోంది. చాల మంది ధన వంతులు ఆచితూచి ఖర్చు పెడతారనీ దుబారాని వ్యతిరేకిస్తూ దాన ధర్మాలకు తన సంపదలో కొంత వినియోగిస్తారని థామస్ పరిశోధన బయట పెడుతోంది.

చాలామంది సంపన్నులకు తమ సంపదను ప్రదర్శించడం ఇష్టం ఉండదనీ సంపన్నులలో చాల ఎక్కువమంది తమ వ్యక్తిగత వాహనాలుగా మామూలు కారునే వాడుతున్నారు అన్న విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు సంపాదనా సంపద వేరువేరు పదాలు అని చెపుతూ బాగా సంపాదించే వారు అంతా సంపన్నులు కాలేరు అంటూ థామస్ స్టాన్లీ అభిప్రాయం. మన దగ్గర ఉన్న డబ్బును మరింత సంపదను సృష్టించడానికి వినియోగిస్తే డబ్బు డబ్బును సంపాదిస్తుంది కాని ఖర్చు పెట్టే వారు దగ్గర డబ్బు ఉండదు అని చెపుతూ మన మన సొమ్ము మన సిబ్బంది అని అంటున్నాడు. ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలి అని అంటే ఇన్ని గంటల సమయం కేటాయించాలి అని అనుకోవడం పొరపాటు అనీ మనకు ఉన్న పరిమితమైన సమయంలో ప్రతి నిముషం డబ్బు సంపాదన కోసమే ఆలోచించాలి అని థామస్ స్టాన్లీ అభిప్రాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: