ది హిందూ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఇంగ్లీష్ ఇప్పుడు అత్యవసరంగా మారిందని అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ రావాల్సిందేనని చెప్పారు. ఒక తండ్రిగా మీరు మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పిస్తారా...? అని జగన్ ప్రశ్నించారు. దేశంలో 27 శాతం నిరక్షరాస్యత ఉందని చెప్పారు.                       
 
దేశ సగటు కన్నా రాష్ట్రంలోనే నిరక్షరాస్యత ఎక్కువ అని అన్నారు. చిన్నప్పటి నుండి తెలుగుమీడియంలో చదివి ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠాశాలలలో, ప్రభుత్వ పాఠశాలలలో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా చేశామని జగన్ అన్నారు. విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. 
 
ఇంటర్నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయని నేడు మనం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తే రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారని అన్నారు. మన దేశంలో 77 శాతం మంది విద్యార్థులు కాలేజీలలో చేరడం చేరడం లేదని ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కనీస అవసరం అని జగన్ అన్నారు. పేదలందరికీ ఇంగ్లీష్ మీడియం అందాలని జగన్ అన్నారు. 
 
అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది లబ్ధి పొందారని జగన్ చెప్పారు. 98.5 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెబుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటివారని ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం పాఠశాలకు పంపగలమా...? అని జగన్ ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: