జగన్మోహన్  రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నిర్మించిన  రాజధాని అమరావతి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే.. చంద్రబాబు అమరావతిని సింగపూర్ లెవల్లో అభివృద్ధి చేస్తానని గ్రాఫిక్ చూపించి తాత్కాలిక రాజధాని మాత్రమే నిర్మించాలి జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నిర్మించిన రాజధానిపై  మరోసారి విమర్శలు చేశారు. విజయవాడలోని ది హిందూ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన... చంద్రబాబు నిర్మించిన గ్రాఫిక్స్ రాజధాని పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

 

 

 సింగపూర్ నగరంలా  అమరావతి నిర్మిస్తాను  అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి తాత్కాలిక రాజధాని నిర్మించారని కానీ ఇప్పుడు విశాఖలో పరిపాలన రాజధాని వద్దు అంటూ అడ్డుపడుతున్నారు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం గత పదేళ్ల నుంచి రాజధాని కాకపోయినప్పటికీ హైదరాబాద్ బెంగళూరు లతో పోటీ పడుతోంది అంటూ జగన్ వ్యాఖ్యానించారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించి జనాలని మోసం చేయదు అంటూ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం పేరుతో బాహుబలి గ్రాఫిక్స్ చూపించి... రాష్ట్ర ప్రజలందరికీ మోసం చేయలేము అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 

 

 చంద్రబాబు నాయుడు గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ సిటీ లాగా నిర్మిస్తామని చెప్పి కేవలం అది గ్రాఫిక్స్ కి  మాత్రమే పరిమితం చేశారని.... తమ ప్రభుత్వం మాత్రం ఇలాంటి గ్రాఫిక్స్ చూపించకుండానే రాజధాని నిర్మాణం చేపడతామని అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఇప్పటికే విశాఖపట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని... ఈ క్రమంలో అమరావతిలో పెట్టాల్సిన పది శాతం మేర నిధులు వైజాగ్ లో పెడితే విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందుతుందని... అదే ఖర్చు అమరావతి లో పెడితే అమరావతి మరో పదేళ్లయినా హైదరాబాద్ బెంగళూరు నగరాలతో పోటీ కి రావడం కష్టమే అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: