ప్రపంచంలోనే ఘనంగా జరిగే గిరిజనుల జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఫంక్షన్ లో ఎక్కడా లేని విధంగా గిరిజనులు రెండు సంవత్సరాలకు ఒకసారి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే జాతర. కొండకోనల్లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. కుంభమేళ తర్వాత అత్యధిక భక్తులు హాజరయ్యే జాతర సమ్మక్క సారక్క జాతర. అందుకే ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు విచ్చేసి అమ్మవార్ల మొక్కులు చెల్లించుకుంటారు. కాగా నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభమైంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య... డ్రోన్ కెమెరా నిఘా మధ్య  మేడారం జాతర  జాతర ప్రారంభమైంది.

 

 

 ఇప్పటికే మేడారం జాతర కోసం వెళ్లి భక్తులందరికీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వేల సంఖ్యలో మేడారంజాతరకు బస్సులను తరలిస్తున్నాయి తెలుగురాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా... గిరిజనులు  మేడారం చేరుకొని గిరిజన దేవతలైన సమ్మక్క-సారక్కలు కొలుచుకుంటారు. మేడారం వెళ్లే భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.

 

 

 అయితే మేడారం జాతర కు బయల్దేరిన భక్తులందరూ.... ముందుగా వేములవాడ దర్శించుకుంటారు. తలనీలాల సమర్పణ కోసం మేడారం జాతరకు ముందు చాలామంది వేములవాడ కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి నుంచి వస్తున్న ఆచారం. చిన్న పిల్లలకు అక్కడ తర్వాత మేడారంలో తలనీలాలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. కాగా జంపన్నవాగు వద్ద మూడు చోట్ల తలనీలాలు ఇచ్చేందుకు కల్యాణకట్ట లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. తలనీలాలు సమర్పించిన అనంతరం జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పటికే మేడారం ప్రాంతం మొత్తం భక్త జనంతో కిటకిటలాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: