ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెగా డిఫెన్స్ ఎక్స్‌ పో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ డిఫెన్స్ ప్రదర్శనను ప్రారంభించారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు.  మూడు రోజులపాటు ఈ ప్రదర్శన జరగనుంది. 

 

ద డిఫెన్స్ ఎక్స్ పో 2020 లక్నోలో మొదలయింది. ఈ ప్రదర్శనలో రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలు, వాటి పరికరాలు ప్రదర్శిస్తున్నారు. రక్షణ రంగంలో పరికరాలు తయారు చేస్తున్న మాన్యూఫ్యాక్చరర్స్ ఈ షోలో పాల్గొంటున్నారు. ఈ నెల 9 వరకు ఈ ప్రదర్శన  జరుగుతుంది. రక్షణ రంగంలో ఆయుధాలు, వాహనాలు, ఉపకరణాలు తయారు చేస్తున్న ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల తయారీదారులు పెద్ద తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా ఒకే చోట కనిపిస్తోంది.  

 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ ,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు అందిపుచ్చుకోవాల్సిన  అవసరం ఉందని ప్రధాని నరేంద్ర  మోదీ అన్నారు.  ప్రపంచానికి ఉగ్రవాదం పెను సవాల్ గా  మారిందన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందు కోసం ప్రతి దేశం రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 25 ఉత్పత్తులను ఉత్పత్తి చేయడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు.  డిఫెన్స్ ఎక్స్పో ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

 

ఫిబ్రవరి 9 వరకు జరగనున్న ఈ ప్రదర్శన మొదటి మూడు రోజులు బిజినెస్ డేస్ గా నిర్ణయించారు. సాధారణ ప్రజానీకాన్ని 8,9 తేదీల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ రెండు రోజులు సందర్శకుల తాకిడి  ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే గోమతి రివర్ ఫ్రంట్ లో జరిగే లైవ్ డెమో కార్యక్రమాలకు మాత్రం అందర్నీ అనుమతిస్తున్నారు. 

 

మరో వైపు దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రానికి ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు పంపింది. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పోలో ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు దొనకొండ అనువైన ప్రాంతమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది ఏపీ. ముఖ్యంగా ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో కీలకమైనదని తెలిపింది. అలాగే, డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉందని తెలిపింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: