శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు చెప్పగానే...మొదట పార్లమెంట్‌లో ఆయన మాట్లాడే స్పీచ్‌లే గుర్తుకొస్తాయి. రాష్ట్రం కోసం ఆయన తన గళాన్ని ఢిల్లీలో గట్టిగానే వినిపిస్తారు. ఇక తాజాగా కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై కూడా బాగానే మాట్లాడుతున్నారు. అలాగే అమరావతి ఉద్యమం, ఆ ప్రాంత రైతుల సమస్యలని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళుతున్నారు. అదేవిధంగా విజయవాడ వచ్చినప్పుడు కూడా అమరావతికి జై అంటూ, అధినేత చంద్రబాబు తెగ సపోర్ట్ చేస్తున్నారు.

 

ఇక అమరావతి కోసం బయట ఇంత చేస్తున్న రామ్మోహన్, సొంత జిల్లాకు వచ్చేసరికి మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. అసలు రాజ‌ధానుల గురించి తన‌ను ఓట్లేసి గెలిపించిన సిక్కోలు జ‌నాల ద‌గ్గ‌ర  నోరెత్తారు. మూడు రాజధానులు వద్దని ఒక్క మాట కూడా మాట్లాడారు. ఎందుకంటే ఒకవేళ అలా మాట్లాడితే, రామ్మోహన్ రాజకీయ భవిష్యత్‌నే శూన్యమైపోతుంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం వల్ల, పక్కనే ఉన్న శ్రీకాకుళం వాసులు కూడా ఆనందంగా ఉన్నారు.

 

సిక్కోలు జిల్లా వాసులు అంతా మూడు రాజధానులని ఆనందంగా స్వాగతిస్తున్నారు. విశాఖకు రాజధాని వస్తే, వెనుకబడి ఉన్న తమ జిల్లాలో మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. అయితే సిక్కోలు ప్రజలు ఈ విధంగా మూడు రాజధానులని స్వాగతిస్తున్నా...రామ్మోహాన్ మాత్రం మారు మాట్లాడటం లేదు. మూడు రాజధానులు కావాలని గానీ, లేదా అమరావతినే రాజధానిగా ఉండాలని చెప్పడం లేదు. ఏదో జిల్లాలో సైలెంట్ గా పనులు చక్కబెట్టుకుని, ఢిల్లీ  లేదా అమరావతిలో తన గళం విప్పుతున్నారు.

 

ఈ మధ్య అయితే ఈయన జిల్లా మొహం కూడా చూడట్లేదని తెలిసింది. అందుకే ఇటీవ‌ల ఆయ‌న్ను అజ్ఞాత‌వాసి అంటున్నారు. కానీ ఢిల్లీలో మాత్రం ప్ర‌త్య‌క హోదా అని.. అమ‌రావ‌తిలో రైతుల బాధ‌ల‌ని గ‌గ్గోలు పెడుతుంటాడు. అదే మాట సిక్కోలులో అంటే ఎంత వ్య‌తిరేక‌త ఉంటుందో ?  ఎక్క‌డ త‌రుముతారో అని భ‌యంతో ఉన్నారు. మొత్తానికైతే రామ్మోహన్ ఇంట్లో పిల్లి...వీధిలో పిల్లి మాదిరిగా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: