2019 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 13 జిల్లాల నుంచి అదిరిపోయే స్థాయిలో సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆఖరికి టీడీపీ బాగా బలంగా ఉన్న రాజధాని అమరావతి జిల్లా గుంటూరులో కూడా ఊహించని స్థాయిలో సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాలు కలిగిన జిల్లాల్లో రెండో స్థానంలో ఉన్న గుంటూరులో...మొత్తం 17 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక ఈ స్థానాల్లో వైసీపీ 15 చోట్ల విజయం సాధిస్తే, టీడీపీ రెండు చోట్ల గెలిచింది. రెండు ఎంపీలు వైసీపీ, ఒక ఎంపీ టీడీపీ గెలుచుకుంది.

 

అయితే 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల 8 నెలల పనితీరు గురించి, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్‌లో ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యేల వారీగా పాయింట్లు ఇచ్చి, ర్యాంకింగ్స్ ఇచ్చారు. రాజధాని ఎమ్మెల్యేలు అందులో చివరి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఉన్న 17 మంది ఎమ్మెల్యేల్లో చిట్టచివరి స్థానంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 22.89 పాయింట్లతో ఉన్నట్లు చెప్పింది.

 

అలాగే వైసీపీలో ఫైర్‌బ్రాండ్స్‌గా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి 26.12 పాయింట్లతో 16వ స్థానంలో, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు 32.22 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నారు. ఇక ఊహించని విధంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని(72.3 పాయింట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరావు(65.6) రెండో స్థానంలో, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి(62.1) మూడవ స్థానంలో, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి(59.1) నాల్గోవ స్థానంలో ఉన్నారు.

 

ఇక రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(55.2) ఐదో స్థానంలో ఉన్నారు. తర్వాత 6. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, 7. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, 8. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, 9. వేమూరు ఎమ్మెల్యే నాగార్జున, 10. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, 11. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా, 12. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, 13. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, 14. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిలు వరుస స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: