మచిలీపట్నం(బందరు)...ఎన్నో దశాబ్దాలు చరిత్ర కలిగిన పట్టణం. పక్కనే సముద్రం ఉండటంతో, బ్రిటిష్ కాలం నుంచే బాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఎంతో చరిత్ర కలిగిన ఈ పట్టణం ఇంకా పూర్తి అభివృద్ధిలోకి రాలేదు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయిగానీ...కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్‌గా ఉన్న బందరు మాత్రం వెనుకబడే ఉంది. ఇక బందరు వాసుల చిరకాల కోరిక పోర్టు నిర్మాణం కూడా జరగలేదు. కానీ ఎప్పుడైతే జగన్ సీఎం అవ్వడం, బందరు ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని మంత్రి కావడంతో పరిస్తితులు ఒక్కసారిగా మారిపోయాయి.

 

ఇప్పుడుప్పుడే పోర్టు నిర్మాణంలో కదలికలు మొదలయ్యాయి. సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టి మరి పోర్టు నిర్మాణంపై ముందుకెళుతున్నారు. ఇప్పటికే పోర్టుకు సంబంధించిన లాజిస్టిక్ పనులని మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే పోర్టు పనులు అలా సాగుతుండగానే, బందరు మున్సిపాలిటీ కాస్త కార్పొరేషన్‌గా మారింది. ఇక కార్పొరేషన్ కావడంతో పట్టణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుంది. అయితే ఈ పరిణామాలు మంత్రి పేర్ని నానికి బాగా కలిసిరానున్నాయి.

 

త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో బందరు కార్పొరేషన్ జరిగే ఎన్నికల్లో పేర్నికి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2014లో బందరు మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు 42 వార్డులు ఉన్న బందరు మున్సిపాలిటీ 50 డివిజన్ల గల కార్పొరేషన్‌గా మారింది.

 

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బందరు పట్టణాన్ని సొంతం చేసుకునేందుకు మంత్రి పేర్ని స్కెచ్ వేసుకుని మరి పనులు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు డివిజన్లలో తిరుగుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటే బందరు కార్పొరేషన్‌ని వైసీపీ సొంతం చేసుకోవడం ఖాయం, మంత్రి పేర్ని ఖాతాలో మరో విజయం నమోదు అవ్వడం పక్కా.

మరింత సమాచారం తెలుసుకోండి: