ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన నిధుల కేటాయింపు జరగక పోవటంతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ప్రాజెక్టులు కూడా ప్రకటించకపోవడంతో తీవ్రస్థాయిలో వ్యతిరేకత అన్ని పార్టీల నుండి వ్యక్తమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ చంద్రబాబు హయాంలో వ్యవహరించిన మాదిరిగానే జగన్ హయాంలో కూడా వ్యవహరించడం జరిగింది.

 

ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని ఇటీవల వైసిపి పార్టీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించిన సందర్భంలో రిప్లై ఇవ్వటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక హోదా ఉద్దేశించి ప్రధాని మోడీ కి లెటర్ రాయడం జరిగింది. మోడీకి జగన్ రాసిన లెటర్ జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ కావటంతో ఏపీ సీఎం జగన్ ని ఉద్దేశించి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అని బీజేపీ నేత హెచ్చరించడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మేటర్ లోకి వెళ్తే బిజెపి ఎంపీ జీవీఎల్ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడంపై స్పందించిన జీవీఎల్ హోదా అనే వ్యవస్థ లేనే లేదని అలాంటి లేని వ్యవస్థ గురుంచి జగన్ మాట్లాడితే ఆయన రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుందని అన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన జీవీఎల్ ఏ రాష్ట్రానికి ఇవ్వనంత గా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ బదులు ప్రాజెక్టుల కోసం 22 వేల కోట్లు అదనంగా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని అది జగన్‌కి కూడా తెలుసని ఎందుకు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: