జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం దెబ్బకు కర్నూలులో టీడీపీ పరిస్తితి నానాటికీ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. అసలే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకుని టీడీపీకి, మూడు రాజధానుల రూపంలో పెద్ద షాక్ తగిలింది. అసలు నేతలు ఎవరు యాక్టివ్‌గా లేరు. ఒకరు ఇద్దరు తప్ప పెద్దగా బయటకొచ్చి మాట్లాడటం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ సైలెంట్ అయిపోగా, కొన్ని చోట్ల వైసీపీలోకి వెళ్లిపోయింది. అటు నేతలు కూడా ఇదే పనిలో ఉన్నారు.

 

ఈ క్రమంలోనే నంద్యాల నియోజకవర్గంలో కూడా టీడీపీ పరిస్తితి మరింత దిగజారిపోయింది. అక్కడ పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి అడ్రెస్ లేరని తెలుస్తోంది. అక్క అఖిలప్రియ కాస్త యాక్టివ్ గానే ఉన్న..తమ్ముడు బ్రహ్మానందరెడ్డి మాత్రం పార్టీలో కనిపించడం లేదు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇక 2019 లో కూడా టీడీపీ నుంచే పోటీ చేశారు. కానీ దారుణ పరాజయం దక్కించుకున్నారు.

 

ఓడిన దగ్గర నుంచి నియోజకవర్గాన్ని వదిలేసి బ్రహ్మానందరెడ్డి, సొంత బిజినెస్ పనులు చూసుకునే పనిలో ఉన్నారు. దీంతో అక్కడ కేడర్‌ని నడిపించే నాయకుడు లేక, వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. అయితే కార్యకర్తలే కాదు, బ్రహ్మానందరెడ్డి కూడా తర్వాత వైసీపీలోకి వెళ్ళే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. అఖిలప్రియ ఎలాగో జగన్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉండటంతో ఆమె పార్టీ అవకాశం లేదని అర్ధమైపోయి, బ్రహ్మానందరెడ్డి మాత్రం సైడ్ అయిపోవాలని చూస్తున్నట్లు తెలిసింది.

 

బ్రహ్మానందరెడ్డికి స్వయానా మామ అయిన బనగానపల్లే వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ద్వారా వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు కాకపోయిన, పరిస్తితులని బట్టి తర్వాత మాత్రం మారే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి అక్కకు తమ్ముడు ఎప్పుడు షాక్ ఇస్తాడో?

మరింత సమాచారం తెలుసుకోండి: