తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా, ఆ పార్టీలోని పదవులు కోసం నేతలు ఎప్పుడు పోటీపడుతూనే ఉంటారు. ఏదొక పదవి వచ్చిన చాలు, తాము కాస్త వెలుగులోకి వస్తామనే ఉద్దేశంతో ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పదవులకు డిమాండ్ తగ్గదు. ఆ పదవులు దక్కించుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రస్తుతం టీడీపీలో అన్నీ పదవులు కోసం పోటీ పడే నేతలు కీలకమైన ‘తెలుగు యువత’ ఊసే ఎత్తడం లేదు. ఆ పార్టీలో పలువురు యూత్ నాయకులు ఉన్న, తెలుగు యువత అధ్యక్షుడు జోలికి వెళ్ళడం లేదని తెలుస్తోంది.

 

అయితే ఇంతలా తెలుగు యువత అంటే భయపడటానికి లోకేశ్‌నే కారణమనే చర్చ జోరుగా సాగుతుంది. గతంలో తెలుగు యువత అధ్యక్షుడుగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్న అవినాష్‌ని లోకేశ్ తోక్కేయడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. అవినాష్‌కు ఎక్కడ లోకేశ్ కంటే పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో, కొందరు చంద్రబాబు భజనబృందం అవినాష్‌ని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఈ విషయం తెల్సుకున్న అవినాష్, అసలు టీడీపీనే వదిలేసి, వైసీపీలోకి వెళ్ళి సెటిల్ అయిపోయారు.

 

అవినాష్ వెళ్లిపోయాక రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు పోస్ట్ ఖాళీగానే ఉంది. ఖాళీగానే ఉన్న ఆ పోస్టులోకి వచ్చేందుకు యువనేతలు ఎవరు సాహసం చేయడం లేదట. మళ్ళీ పదవి వచ్చాక చినబాబు వల్ల మనం ఇబ్బంది పడాలని సైలెంట్ అయిపోయారట. పరిటాల శ్రీరామ్, రామ్మోహన్ నాయుడు, కరణం వెంకటేష్, చింతకాయల విజయ్, మాగంటి రాంజీ, బండారు శ్రావణి, భూమా అఖిలప్రియ లాంటి యువనేతలు సైతం దాని జోలికే వెళ్ళడం లేదట.

 

కాకపోతే టీడీపీకి అనుబంధ సంస్థ అయిన టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరీ ఈ మధ్య పార్టీలో బాగా హడావిడి చేస్తున్నారు. కాబట్టి ఈయనకి ఆ పదవి ఏమన్నా దక్కే అవకాశముందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ పదవి వచ్చినా..చినబాబు దెబ్బకు, బ్రహ్మం కూడా తట్టా బుట్టా సర్దుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం కూడా ఉంది. మొత్తానికి చినబాబు దెబ్బకు తెలుగు యువత వణుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: