ఒకోసారి రాజకీయాల్లో వారసులు, బంధువులు వల్ల ఎంత మేలు జరుగుతుందో...అంతకంటే ఎక్కువే నష్టం జరుగుతుంది. వారు చేసే పనులు వల్ల చెడ్డపేరే రావడం కాకుండా, రాజకీయంగా చాలా ఇబ్బందికర పరిస్తితి వస్తుంది. ఇక ఈ విధంగానే టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడులు ఇబ్బంది పడుతున్నారట. బండారు...రామ్మోహన్ నాయుడు మామయ్య అన్న సంగతి అందరికీ తెలిసింది. బండారు కుమార్తెనే రామ్మోహన్ పెళ్లి చేసుకున్నారు.

 

అయితే బండారు కుమారుడు, రామ్మోహన్ బామ్మర్ది అప్పలనాయుడు వల్ల ఇటు బండారుకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవడంతో పాటు, అటు రామ్మోహన్ పరువు కూడా పోతుందని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మొదటి నుంచి బండారు కుమారుడు వివాదాలతో సావాసం చేస్తారు. గత ఐదేళ్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పలనాయుడు, బాగా హడావిడి చేశారనే ప్రచారం ఉంది. అలాగే పలు భూ అక్రమాల కేసుల్లో, ఇసుక దందాల్లో అప్పలనాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది.

 

ఒకానొక దశలో జనసేన అధినేత పవన్ కల్యాణ్....బండారు కుమారుడు భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కుమారుడు బాగోతం వల్లే బండారు 2019 ఎన్నికల్లో పెందుర్తి నుంచి చిత్తుగా ఓడిపోయారు. ఇక అధికారం పోయిన కూడా అప్పలనాయుడు ఆగలేదు. నియోజకవర్గ టీడీపీపై పెత్తనం చెలయిస్తూనే ఉన్నారు.

 

పైగా ఇటీవల బీచ్‌లో స్నేహితులతో కలిసి మద్యం తాగేసి, తన వాహనంతో బైక్‌ను ఢీకొట్టి పరారయ్యాడు. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు కూడా. ఇక ఈ విధంగా పలు కేసుల్లో, ఆరోపణల్లో అప్పలనాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీని వల్ల పెందుర్తిలో టీడీపీ నాశనమైపోయే స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. అలాగే బండారు రాజకీయ జీవితానికి ఇబ్బందులు ఎదురవడంతో పాటు, రామ్మోహన్ పరువు కూడా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: