ఏపీలో ఒకప్పుడు టీడీపి హవా మామూలుగా సాగలేదు. చంద్రబాబు నెలవంకలా వెలిగిపోయాడు.. కాని ఇప్పుడున్న పరిస్దితులో, ఆ వెలుగులన్ని మాయం అయ్యాయి. చీకటి బాబుగా మిగిలాడు. ఇలాంటి పరిస్దితుల్లో తాజాగా ఒక వార్త బయటకు వచ్చిందట.. అదేమంటే చంద్రబాబు, జగన్‌ల మధ్య సయోధ్య సయోధ్య కుదర్చడానికి ఒక వర్గం వారు తీవ్ర ప్రయత్నాలు చేసారట.. ఇందులో ప్రముఖంగా పదవి విరమణ చేసిన న్యాయమూర్తి ప్రముఖ పాత్ర పోషించాడనే వాదన వినిపిస్తుంది.

 

 

అయితే ఏపీలో కనుక బీజేపీ బలపడితే ఈ రాష్ట్ర పార్టీలైనా తెలుగుదేశం, వైసీపీలకు కష్టాలు మొదలవుతాయి కనుక ఇక్కడ ఉంటే మీ పార్టీ, లేదా మా పార్టీ మాత్రమే ఉండాలి గానీ బిజేపీకి ఇక్కడ బలం పెరిగేలా చేయకూడదనే అంశాన్ని జగన్ దగ్గర ఆ మాజీ న్యాయమూర్తి ప్రస్తావించాడట.. ఇదే కాకుండా శతవిధాల జగన్‌ను ఆ మాజీ న్యాయమూర్తీ మభ్యపెట్టుదామని ప్రయత్నించాడట. ఇక్కడ కనుక బీజేపీ అధికారంలోకి వస్తే మనకు భద్రత ఉండదని, మన పార్టీల మనుగడ కష్టం అవుతుందని, మోడీ గురించి, ఆ పార్టీ గురించి అన్నీ కల్పిస్తూ మాయ చేయాలని ప్రయత్నించాడట.

 

 

కానీ అతని వ్యూహం ఏది ఫలించలేదని సమాచారం.. ఈ విషయంలో జగన్ ఆ న్యాయమూర్తితో మాట్లాడుతూ, నేను ప్రస్తుత పరిస్దితుల్లో చంద్రబాబుని నమ్మే పరిస్దితుల్లో లేను. ఇక బీజేపీ అంటారా నేను కష్టాల్లో ఉన్నప్పుడు మోడీ గారు అండగా ఉన్నారు కనుక, నేను వ్యక్తిగతంగా మోడీ గారికి నష్టం కలిగే పనులను చేయనని, ఆ న్యాయమూర్తికి జగన్ ఖచ్చితంగా చెప్పినట్లుగా సమాచారం.. ఇదిలా ఉండగా బాబు చేసిన ఈ తీవ్రప్రయత్నం బెడిసికొట్టడంతో, మరో ఎత్తుతో మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం దగ్గర మోర పెట్టుకుంటున్నట్లుగా, ఎలాగైనా తన రాజకీయ అనుభవంతో జగన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా కొందరిఉ జగన్ వర్గీయులు అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: