గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక కేంద్ర బడ్జెట్ రెండుసార్లు ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదు. ఇక దీనిపై స్పందించిన టిడిపి పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 22 మంది ఉన్న అధికార పార్టీ ఎంపీలు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. వైసీపీ పార్టీకి 22 మంది ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెడితే... 22 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ఏం తీసుకువచ్చారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. 

 

 

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న వైసీపీ ఎంపీలు ఏ విధంగా సాధిస్తారు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టింది... కానీ వైసిపి రాష్ట్రానికి ఏం సాధించింది అంటూ నిలదీశారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం గురించి పార్లమెంటు వేదికగా టీడీపీ ఎంపీలు ప్రస్తావిస్తే దానిని 22 మంది వైసీపీ ఎంపీలు అడ్డుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని... అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు అని విమర్శించారు. 

 

 

 అయితే 22 మంది అధికార పార్టీ ఎంపీలు...  టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపడం కాదు.ఆ  ప్రతాపం మొత్తం  కేంద్ర ప్రభుత్వం పై చూపి ప్రత్యేక హోదా సాధించండి అంటూ  సూచించారు. ఒకవేళ ప్రత్యేక హోదా కోసం 22 మంది అధికార పార్టీ ఎంపీలు పోరాటం చేస్తే తాము కూడా వారికి మద్దతు ప్రకటిస్తామని అంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పరిణామాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషంగా ఉన్నారు అంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందని అంటూ తెలిపారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: