టీమ్ ఇండియా ఏ మ్యాచ్ గెలిచిన... ఎంత అద్భుత ప్రదర్శన చేసిన... ఎలాంటి జట్టును చిత్తు చేసి  విజయం సాధించిన.. టీమిండియాలో గత కొంత కాలంగా మొదటగా వినిపిస్తున్న పేరు కేఎల్  రాహుల్. తనదైన టెక్నికల్ బ్యాటింగ్  తో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు కేఎల్ రాహుల్. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో  అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థి జట్లపై భారీ స్కోరు నమోదు చేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న న్యూజిలాండ్తో జరిగిన ఐదు టి20లో సిరీస్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్లో రాహుల్ 224 పరుగులు చేసి టి20 సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈ సిరీస్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా నిలిచాడు కేఎల్ రాహుల్ .

 

 

 ఇక నేడు హామీల్టాన్ వేదికగా  న్యూజిలాండ్ టీమిండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్కు న్యూజిలాండ్ జట్టు భారీ షాక్ ఇచ్చింది. నాలుగు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది న్యూజిలాండ్ జట్టు. అయితే  టీమ్ ఇండియా జట్టు ఓటమి పాలైనప్పటికి కూడా టీమిండియా క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ మాత్రం తమ బ్యాటింగ్తో అందరి మనసులు గెలుచుకున్నారు అని చెప్పాలి. ఇక కేఎల్  రాహుల్ మిడిలార్డర్లో ఐదవ ఆటగాడిగా బరిలోకి దిగి అద్భుతమైన బ్యాటింగ్ తో  అదరగొట్టాడు. భారీగా బౌండరీలు బాదుతూ బౌలర్లందరిని ఉక్కిరిబిక్కిరి చేశాడు కేఎల్  రాహుల్.కాగా  కేఎల్ రాహుల్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. కేఎల్ రాహుల్ కత్తి కంటే చాలా పదునుగా ఉన్నాడు అంటూ వ్యాఖ్యానించాడు టీం ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ . 

 

 

 టీమిండియా జట్టులో కేఎల్ రాహుల్ ఓపెనర్గా వికెట్ కీపర్గా వన్టౌన్ బాడ్మింటన్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ గా తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా 5వ స్థానంలో వచ్చి బెస్ట్ ఫినిషర్ గా కూడా కె.ఎల్.రాహుల్ నిరూపించుకున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇలా ఏ స్థానంలో ఆడిన సరే కె.ఎల్.రాహుల్ రెచ్చిపోతున్నాడు.రాహుల్  నీ ఆటతీరు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి అని నేను కోరుకుంటున్నా అంటూ మహమ్మద్ కైఫ్ సోషల్ మీడియా  వేదికగా రాహుల్ పై ప్రశంసలు కురిపించాడు. కాగా ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్... ప్రత్యర్థి జట్టు ఏదైనప్పటికీ బౌలింగ్ చేస్తుంది ఎంత దిగ్గజ బౌలర్ అయినప్పటికీ కూడా... ఓపెనర్ స్థానం నుంచి 5వ స్థానం వరకు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: