ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత టిడిపి పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన విషయం తెలిసిందే. టిడిపి పార్టీ ఎన్నడు ఎరుగని విధంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడడంతో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత టిడిపి నుంచి కీలక నేతలు అందరూ ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటంతో... ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టిడిపి పార్టీ రోజు రోజుకు మరింత బలహీనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే బాగుంటుంది అనే వాదనలు కూడా ఆంధ్ర రాజకీయాల్లో వినిపించాయి. అంతేకాకుండా జూ ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే టిడిపి పార్టీకి పూర్వవైభవం వస్తుందని పలుమార్లు వైసీపీ నేతలు కూడా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో టిడిపి పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలి అన్నది అందరూ అనుకుంటున్న మాటలు . కొత్త అధ్యక్షుడు వస్తేనే టీడీపీ పార్టీకి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని... పార్టీ పగ్గాలను చంద్రబాబు నుంచి వేరే వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అని ఆంధ్ర రాజకీయాల్లో  చర్చించు కుంటున్నారు. అయితే అటు వరుసగా కీలక నేతలు అందరూ పార్టీని వీడుతుండడం.. అధికార పార్టీపై ఎదురించటానికి  సరైన బలం లేకపోవడం.. అంతేకాకుండా టీడీపీకి అధికార పార్టీని ఎదిరించేందుకు శాసనమండలిలో బలం ఉన్నప్పటికీ తాజాగా జగన్ సర్కార్ శాసనమండలిని రద్దు చేయడంతో టిడిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరింత బలహీనపడి పోయింది.  ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు కూడా ఆ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

 

 

 ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన టీడీపీ జాతీయ  అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు... ఇందులో భాగంగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడిని  నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవిని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోలుకోలేని స్థితిలో ఉన్న టిడిపి పార్టీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు వచ్చినప్పటికీ... మాస్టర్ మైండ్ చంద్రబాబు లాంటి వ్యూహాలను అమలు చేయడం మాత్రం కాస్త కష్టమైన పనే. అంతేకాకుండా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాస్టర్ మైండ్ చంద్రబాబుకే  పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం తలనొప్పిగా  మారితే... కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న అచ్చెంనాయుడు కి పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకు రాబోతున్నారూ  అనే చర్చ ఆంధ్ర రాజకీయాల్లో మొదలైంది. గత కొన్ని రోజుల నుంచి టిడిపి పగ్గాలు ఎవరు చేతిలోకి వెళ్తాయ ఎదురుచూస్తుండగా.... ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ పగ్గాలు అచ్చన్నాయుడు చేతుల్లోకి వెళ్లాయి. అచ్చం నాయుడు ఏమైనా మాయచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాడ లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: