వైఎస్ జగన్.. ఏపీలో తిరుగులేని లీడర్.. వైఎస్ తనయుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఆ తర్వాత కొద్ది కాలానికే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత పార్టీ అధిష్టానానం ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వతా ఏకంగా సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఢక్కా మొక్కీలు తిన్నాడు. అలవికాని అబద్దపు హామీలిస్తే.. సీఎం అయ్యే అవకాశం ఉందని పార్టీలో నేతలు చెప్పినా.. లొంగలేదు. చివరకు ఏపీకి సీఎం అయ్యాడు.

 

ఈ మొత్తం ప్రస్థానంలో జగన్ ను లీడర్ ను చేసిన లక్షణం.. నిజాయితీ.. చేసిందే చెప్పడం.. చెప్పేదే చేయడం.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా అదే ముక్కుసూటి తనం.. అదే నిజాయితీ.. తాజాగా ఆయన రాజధానిపై చేసిన వ్యాఖ్యల్లోనూ ఆ నిజాయితీయే ప్రతిబింబించింది. చేయలేని పని చేస్తానని చెప్పలేను.. గ్రాఫిక్సు చూపించి మోసం చేయలేనంటూనే వాస్తవ పరిస్థితిని జగన్ కళ్లుకు కట్టారు.

 

ఆయన ఏమన్నారంటే.. “ రాజధాని పేరుతో 5677 కోట్లకుపైగా ఖర్చు చేసింది గత ప్రభుత్వం. పైగా మరో 2,300 కోట్లు అప్పు మా ప్రభుత్వం మీద సులువుగా వేసేసి మరీ పోయింది. 10.52% వడ్డీతో అప్పలు తెచ్చి ఈ ప్రభుత్వం నెత్తిన వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1500 కోట్లు మాత్రమే వచ్చింది. దాన్నిమించి వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. మహా అయితే మరో 1000 కోట్లు ఇస్తారేమో. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే నేను నిలబడ్డ ఈ అమరావతి ప్రాంతం అభివృద్ధి చేయాలంటే, కనీస మౌలిక వసతులు కల్పించడానికే దాదాపుగా 1లక్షా9వేల కోట్లు ఖర్చు చేయాలి.

 

రోడ్లు, డ్రైన్లు, కరెంటు, నీరు అందజేయాలంటేనే లక్షకోట్లు పెట్టాలి. ఇక్కడ నేను 5 లేక 6000 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. అంటే సముద్రంలో నీటి చుక్కలాగా.. అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారు జగన్. ఏం చేయమంటారో మీరే చెప్పడన్నట్టు లెక్కలు వివరించారు. ఈ నిజాయితీ యే ఆయన్ను లీడర్ ను చేసింది. ఆయన విశ్వసనీయత పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: