జగన్ ఏపీ సీఎం అయ్యాక.. అనేక కొత్త పద్దతులు అమల్లోకి తెచ్చారు. వాటిలో రివర్స్ టెండరింగ్ విధానం ఒకటి. ఇది దేశంలోనే తొలిసారిగా అమల్లోకి వచ్చిన ఓ ప్రక్రియ. మూలాల నుంచి అవినీతిని నిర్మూలించడమే తన లక్ష్యం అన్న జగన్.. దేశం అంతా ఆదర్శంగా తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు.

 

అదేంటంటే.. . 100కోట్లకు పైబడిన ఏ టెండర్ అయినా ముందు జడ్జి ముందుకు వెళుతుంది. దీన్ని వారు పబ్లిక్ డొమైన్లో వారం రోజులు ఉంచుతారు. కాంట్రాక్ట్ లో ఉన్న నిబంధనలపై ఎవరికి అభ్యంతరాలున్నా, సలహాలు ఇవ్వదలుచుకున్నా ఇవ్వొచ్చు. ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ విధానం ఏపీకి చాలా బాగా ఉపయోగపడుతోంది. ఎలాగంటే.. చాలా వరకూ అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుందంటే ప్రాజెక్టుల టెండర్లు టైలర్ మేడ్ లా ఉంటాయి. కొందరు మాత్రమే అర్హత పొందేలా వాటిని తయారు చేస్తుంటారు. దీన్ని నివారించడానికే జగన్ సర్కారు ఈ ప్రివ్యూ కమీషన్ ఏర్పాటు చేసింది.

 

న్యాయమూర్తి ఆధ్వర్యంలో అధికారులు టెండర్ నిబంధనలు ఖరారౌతాయి. టెండర్లో అతి తక్కువ కోట్ చేసిన ఎమౌంట్ ను చూపిస్తూ రివర్స్ టెండరింగ్‌కు వెళతారు. దాని కంటే తక్కువకు ఆ టెండర్ చేస్తామని ఎవరు పోటీ పడినా వారికి ప్రాజక్టు కాంట్రాక్టు అప్పగిస్తారు. ఈ రివర్స్ టెండరింగ్ విధానం ఎంత సక్సస్ అయ్యిందంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో దాదాపుగా 2000 కోట్లు ఈ రివర్స్ టెండరిగ్ ద్వారా ఆదా చేయగలిగారు. పేదల ఇళ్లకు సంబంధించిన టిడ్కో ప్రాజెక్టు అందుకు ఓ ఉదాహరణ.

 

 

గతంలో సుమారు 2700 కోట్లుగా నిర్ణయమైన ఈ టెండర్‌ను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా దాన్ని 2300 కోట్లకు తీసుకురాగలిగారు. అలాగే పోలవరంలో గత టెండర్ తో పోలిస్తే రివర్స్ టెండరింగ్ ద్వారా 830 కోట్లు ఆదా చేయగలిగారు. రాష్ట్రంలో ఇక ఏ టెండర్ అయినా ఇప్పుడు ఇదే పద్ధతిలో చేయబోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: