చాలా మంది ఇళ్లల్లో పాత కాలం నాటి బంగారు ఆభరణాలను ఇప్పటికీ వినియోగిస్తూనే ఉంటారు. కొందరు సెంటిమెంట్ అని కొందరు తరతరాల నుండి వస్తున్న బంగారు ఆభరణాలు అని ఆ ఆభరణాలనే వినియోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధన వలన పాత కాలం నాటి నగలు, బంగారు ఆభరణాలు ఉన్నా ఆ ఆభరణాల విలువ తగ్గనుంది. 
 
రోజురోజుకు బంగారం కొనుగోళ్ల విషయంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ మోసాల గురించి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో కేంద్రం బీఐఎస్ హాల్ మార్క్ అనే ముద్రను గతంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం వినియోగదారులు కూడా బంగారు ఆభరణాలపై బీఐఎస్ హాల్ మార్క్ ఉంటే మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు కూడా బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే విక్రయిస్తున్నాయి. 
 
కానీ పాతకాలంలో తయారైన నగలకు ఇలాంటి హాల్ మార్క్ లు ఉండవు. కంసాలీలు నగలను తయారు చేసి ఇచ్చేవారు. ఇప్పుడు మార్కెట్ లో బంగారం స్వచ్ఛతను బట్టి 916 కేడీఎం, 14క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ లు ఉన్నాయి. ప్రజా ప్రయోజన మంత్రిత్వ శాఖ నగలకు బీఐఎస్ హాల్ మార్క్ తప్పనిసరి అని నిబంధన తెచ్చింది. వినియోగదారులను కల్తీ బంగారం నుండి కాపాడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. 
 
బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు హాల్ మార్క్, బిల్లు, బంగారం స్వచ్చతను తెలిపే క్యారెట్లు కూడా ఉండే నగలను కొనుగోలు చేయాలని ప్రజా ప్రయోజనాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వలన పాత నగలు ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. కేంద్రం తీసుకొచ్చిన నిబంధన వలన పాత నగలను అమ్మినా హాల్ మార్క్, ఇతర వివరాలు పాత నగలకు లేకపోవడం వలన వాటి విలువ చాలా తక్కువగా వస్తుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: