అయోమయం ఇప్పుడు ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఇలా ఎందుకంటే ఎప్పుడైతే మూడు రాజధానులని ప్రకటించారో, అప్పుడు చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్దట్లు అయ్యింది. ఇకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ప్రత్యేక హోదా అంటూ కేంద్రం చుట్టు తిరిగినా తాను సాధించింది ఏం లేదు. అలా అయిదు సంవత్సరాల పదవి కాలాన్ని ముగించాడు.

 

 

ఆ తర్వాత వైఎస్సార్ ప్రభుత్వం పదవిలోకి వచ్చాక ఏపీ సీయం గా జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్లుతున్నాడు. ఇలాంటి సమయంలో ఏపీకి మూడూ రాజధానులు ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందని భావించిన జగన్ సర్కార్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు పోతుంది.. ఈ సమయంలో ప్రతిపక్షాలు, మూడు రాజధానుల విషయంలో నానా యాగి చేస్తూ దర్నాలని, అదని, ఇదని ఎన్నో అడ్దంకులు సృష్టిస్తుంది.

 

 

ఇదే సమయంలో కేంద్రం వద్దకు వెళ్లిన ఈ సమస్య విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని చెప్పింది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఏపీ రాజధానుల వ్యవహారం కాస్త.. లోక్‌సభను తాకింది.. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశమని, రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు..

 

 

అయితే గత ప్రభుత్వ జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని పేర్కొన్నారు. ఇకపోతే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అటూ కేంద్రం తీరుతో  ఏపీ ప్రజలు తీవ్రమైన అసహానికి గురవుతున్నారు. ఇప్పటికి మూడు రాజధానుల విషయంలో అయోమయం కొనసాగుతుండటం, అభివృద్ధికి అంటంకంగా మారిన ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం అవుతుందా లేదా అనే ఎదురు చూపులు తప్పేలా లేవని అనుకుంటున్నారట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: