ఈ మధ్య వ్యభిచార కూపాలు  రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. యువతులకు మాయమాటలు చెప్పి నమ్మించి వ్యభిచార కూపంలోకి దింపుతారూ  చాలామంది ఏజెంట్లు. అంతేకాకుండా విలాసవంతమైన భవనాలను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా ఎవరికీ అనుమానం రాకుండా సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఇలా భారీగానే డబ్బులు దండుకుంటున్నారు. ఇక విటులను ఆకర్షించే ఎందుకు ఎంతోమంది సెక్స్ రాకెట్ ముఠా ఏజెంట్లు ఎన్నో ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉంటారు. అయితే పోలీసులు దాడి చేసి ఎన్ని సార్లు కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పటికీ కూడా ఈ సెక్స్ రాకెట్ నిర్వహించే నిర్వాహకుల తీరు మాత్రం అస్సలు మారదు. శిక్ష పడినప్పటికీ మళ్లీ అదే దారిలో కొనసాగుతూ ఉంటారు. 

 

 

 ఇలా పలు నగరాలలో.. సెక్స్ రాకెట్ లు కాస్లీ  భవనాల ముసుగులో యథేచ్ఛగా  సాగిపోతున్నాయి. సెక్స్ రాకెట్ నడుపుతూ భారీ దందా కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా విటులను ఆకర్షించేందుకు  సెక్స్ ముఠాలు  కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా పూణేలోని ఓ సెక్స్ రాకెట్ ను పోలీసులు భగ్నం చేశారు. కీలక సమాచారం తో సెక్స్ ముఠా పై దాడి చేసిన పోలీసులు గుట్టు రట్టు చేశారు. కాగా  రాకెట్ ముఠా ను విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అటు పోలీసులు కూడా షాక్ అవ్వాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సెక్స్ రాకెట్ ముఠా నడుపుతున్న నిర్వాహకులు విదేశీ యువతులను కూడా సప్లై చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఎవరైనా విటులు  విదేశీ యువతిని బుక్ చేసుకుంటే మరో స్వదేశీ యువతి ఫ్రీగా పంపుతారట. 

 

 

 పూణే వేదికగా నడుస్తున్న ఈ సెక్స్ రాకెట్ లో రష్యా సెరెబ్రియా  ఉక్రెయిన్ నుంచి టూరిస్ట్ పాస్పోర్టు ల మీద యువతులను రప్పిస్తారు. ఇక అలా వచ్చిన యువతులతో వ్యభిచారం కొనసాగిస్తారు. ఇక తాజాగా పోలీసులు ఓ ప్రముఖ హోటల్ పై రైడ్ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. పూణే కేంద్రంగా హోటల్ పార్క్ లో కొన్ని గదులు అద్దెకు తీసుకుని సోనీ అనే నిర్వాహకురాలు ఈ సెక్స్ రాకెట్ను నడుపుతోంది. కాగా సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు డికాయ్  మిషన్ చేపట్టి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఈ సందర్భంగా విదేశాలకు చెందిన యువతులను సెక్స్ రాకెట్ నుంచి విడిపించారు. పలువురు వ్యభిచారుల కు విముక్తి కలిగించారు.. ఇక ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్న వారిపై మహిళల అక్రమ రవాణా సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు,

మరింత సమాచారం తెలుసుకోండి: