ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానంలో నాలుగు‌ కీలక పిటీషన్లపై విచారణ చేపట్టనున్నారు. ఈ క్రమంలో వివేకానంద కుమార్తె సునీత, పంచాయతీ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగుపైన, కృష్ణ కిషోర్ నిధుల దుర్వినియోగంపైనా హై కోర్టు విచారణ చేపట్టనుంది. వివరాల్లోకి వెళ్ళితే..  దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వై ఎస్ వివేకానంద రెడ్డి  హత్య కేసును సిబిఐకు అప్పగించాలంటూ వివేకా కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మలు కూడా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, టిడిపి నేతలు బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై హై కోర్ట్ విచారణ చేయనున్నది. దీనితో ఈ విచారణ అంశం ప్రాధ్యాన్యతను సంతరించుకుంది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని  గ్రామ పంచాయితీ కార్యాలయాలకు అధికార పార్టీ అయిన వైసిపి రంగులు వేయడాన్ని ఖండిస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టనున్నారు. 

ఈడీబీ ఎక్స్ సీఈవో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ నిదుల దుర్వినియోగం చేసిన సిబిఐ కేసుపై హైకోర్టులో విచారణ జరగనున్నది. కృష్ణ కిషోర్ కు హైకోర్ట్ ప్రొటెక్షన్ కు శుక్రవారం డెడ్ లైన్. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఇప్పటికే ‌ఆధారాలు సేకరించిన సిఐడి అధికారులు. దీనిపై శుక్రవారం హైకోర్టు ఆధారాలు సమర్పించి, కృష్ణా కిషోర్ ను విచారణ కోసం సిఐడి‌ కస్టడీకి కోరే అవకాశం లేకపోలేదు. 


 ఏపీలో స్థానిక ఎన్నికల జీవో 176ను నిలుపుదల చేయాలంటూ కర్నూలుకు చెందిన ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలుపై సుప్రీం అభ్యంతరాలుండటంతో‌ 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా, 50 శాతానికే పరిమితం చేయాలా, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలపై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. 

మరింత సమాచారం తెలుసుకోండి: