అవును బిజెపి ఎంపి జీవిఎల్ నరసింహారావు వ్యవహార శైలి చూసిన తర్వాత ఇపుడందరు ఇలాగే అనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి  జీవిఎల్  మద్దుతుగా నిలబడినట్లు వైసిపి ఎంపిలు కూడా నిలబడటం లేదన్నది వాస్తవం. మూడు రాజధానుల విషయం కావచ్చు లేదా శాసనమండలి రద్దు తీర్మానం విషయం కూడా కావచ్చు.  సొంతపార్టీలోని ఎంపిలు ఎంతమంది జగన్ కు మద్దతుగా తమ వాదనను వినిపిస్తున్నారో ఎవరికి వారుగా ఆత్మపరిశీలన చేసుకుంటే తెలిసిపోతుంది.

 

ఉండటానికి పార్టీ తరపున 22 మంది ఎంపిలున్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా  రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పి కొట్టగలుగుతున్నారు ?  సమస్యేమిటంటే వైసిపి ఎంపిల్లో చాలామంది ఎవరికి వారుగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవటంలోనే బిజీగా ఉన్నట్లున్నారు. అందుకనే పై అంశాలకు సంబంధించి ప్రతిపక్షాల ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టటంలో వెనకబడిపోయారు.

 

అదే జీవిఎల్ విషయం తీసుకోండి. పై రెండు అంశాలకు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి, పురంధేశ్వరితో పాటు కొత్త మిత్రుడు, జనసేన అధినేత  పవన్ కల్యాణ్, టిడిపి ఎంపిలు జగన్ పై చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. సొంతపార్టీ ఎంపిలు, నేతలని కూడా చూడకుండా పై రెండు అంశాల్లో జగన్ ను తప్పుపడుతూ కేంద్రాన్ని సీన్ లోకి లాగుతుంటే జీవిఎల్ మాత్రం వెంటనే వాళ్ళ ప్రకటనలను ఖండిస్తున్నారు.

 

అలాగని జీవిఎల్ ఏమీ ఏ విషయంలో కూడా  జగన్ కు మద్దతుగా నిలబడటం లేదు. కాకపోతే రాజధానుల విషయంలో కానీ శాసనమండలి రద్దు వ్యవహారంలో కానీ  కేంద్రానికి సంబంధం లేదనే నిజాన్ని పదే పదే వివరిస్తున్నారంతే. జీవిఎల్ చేస్తున్న ప్రకటనలు, మీడియాలో మాట్లాడుతున్న మాటలు, టివి చర్చల్లో చేస్తున్న కామెంట్లే జగన్ కు మద్దతుగా ఉంటున్నాయన్నదైతే వాస్తవం.  పరోక్షంగా  జీవిఎల్ అందిస్తున్న మద్దతుకు జగన్ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండిపోవాలేమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: