ప్రస్తుతం చైనా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందిని ప్రాణ భయంతో గజగజ వణికిస్తోంది . కరోణ వైరస్కు సరైన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో ప్రాణాలు పోవడం ఖచ్చితం గా మారిపోయింది. ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా  వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఈ మాయదారి కరోనా  వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. అయితే కరోనా  వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో చైనాలోని వైద్యులందరూ..  వైరస్ సోకిన వారందరికీ చికిత్స అందించేందుకు శాయశక్తుల పని చేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా కరోనా  వైరస్ బాధితుల కోసం ఆసుపత్రిలను  సైతం శరవేగంగా నిర్మిస్తున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే కరోనా  వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు చైనాలోని ఓ వైద్యుడు తన వివాహ తంతును కేవలం పది నిమిషాల్లోనే ముగించుకున్నాడు . పదినిమిషాల్లో  పెళ్లి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ కరోనా  వైరస్ బాధితులకు చికిత్స చేసేందుకు విధుల్లో హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ విషయం కాస్తా వైరల్ అయిపోయింది. ఇక ఈ వైద్యుడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... శాండాంగ్  లోని హెజె  ప్రాంతానికి చెందిన లీ జింక్విన్ ... శాండాంగ్  యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే చైనాలో  కరోనా వైరస్ గుర్తించక ముందే అతనికి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే జనవరి 30వ తేదీన పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. 

 

 

 కాగా ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో రోగులకు చికిత్స అందించడంలో ఆ వైద్యుడు నిమగ్నమైపోయాడు. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ బాధితులకు చికిత్సను అందించడంలో నిమగ్నం అయినప్పటికీ తమ వివాహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తమ తల్లిదండ్రుల సమక్షంలో కేవలం పది నిమిషాల్లోనే పెళ్లి చేసుకున్నాడు. ఇక పది నిమిషాల తర్వాత లీ జింక్విన్  యధావిధిగా విధులకు హాజరయ్యారు అంటూ ఒక స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. కరోనా  వైరస్ బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు.. జీవితంలో ఓ మధుర జ్ఞాపకం అయిన పెళ్లిని కూడా త్వరగా ముగించుకొని.. విధుల్లో హాజరై డెడికేషన్ చూపించిన ఆ వైద్యులపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. అందుకు అంగీకరించిన వధువు హొంగ్యాన్  ను కూడా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: