పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. అమరావతి రైతుల ఆందోళనల నుండి, రాష్ట్రంలో జరిగే ప్రతీ దానిపై స్పందిస్తున్నారు. రాష్తంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నా కూడా వారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గొంతు వినపడుతోంది. అధికార్ పక్షం కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తోంది. అయితే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఏమి చేసినా మీడియాలో ఎక్కువ కనిపించకుండా పోయేది.

 

 

ఒకవేళ కనిపించినా విమర్శించడానికే తప్ప అనుకూలంగా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ఇప్పటికీ కూడా అలాగే ఉన్నప్పటికీ తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా చెప్పుకోబడే యెల్లో మీడియా మాత్రం ప్రస్తుతం పవన్ పట్ల విపరీతమైన ప్రేమ ఒలకబోస్తుంది. ఒకప్పుడు పవన్ ని తిట్టినవాళ్ళే నేడు పవన్ చేస్తున్న పనులని మెచ్చుకుంటూ అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు.

 

 

చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ ని విమర్శలు చేయట్లేదు. అయితే దీనికి గల కారణం ఏమిటనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా పట్టు ఉంది. అదీ కాకుండా పవన్ చాలా బలమైన నాయకుడు. ఏ విషయాన్నైనా చాలా గట్తిగా వినిపించగలడు.

 

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ పై ప్రజల్లో నమ్మకం బాగా పెరుగుతోంది. రాజధాని విషయమైతేనేం, మరోటి అయితేనేం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ ఒక దేవుడిలా కనిపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో పవన్ తో గొడవ పెట్టుకోవడం కంటే చెలిమితో ఉంటేనే బాగుంటుందన్న కారణంతో యెల్లో మీడియా పవన్ ని ఆకాశానికెత్తేస్తోంది. గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే టిడీపీకి సీట్లు తగ్గాయని కొందరి వాదన. అందుకే ఇప్పటి నుండే స్నేహంగా ఉంటే, వచ్చే ఎన్నికల్లో పనికొస్తాడనే కారణంతో ఇలా చేస్తున్నారని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: