కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే విషయంపై అందరిలోను అనామానాలు పెరిగిపోతున్నాయి.  ఎవరో జగన్మోహన్ రెడ్డిని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకపోతే సలహదారులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులున్నారు. అంటే నియమ, నిబంధనలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళుండి కూడా జగన్ తప్పుటడుగులు వేస్తున్నారంటే ఏమిటర్ధం ?

 

తాజాగా  విజిలెన్స్ కమీషనరేట్, కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాల బదిలీపై హై కోర్టు చేసిన వ్యాఖ్యల వల్లే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించాలి జగన్ అనుకున్నారు. అలాగే కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. సరే ఈ నిర్ణయాలు రాజకీయంగా చాలా కీలకమైనవనే చెప్పాలి. అయితే పై రెండు అంశాల్లో జగన్ కు వ్యతిరేకంగా కొందరు  హై కోర్టుకెక్కారు.

 

మరి జగన్ ఏం చేస్తున్నారు ? ఏదో రూపంలో తాను అనుకున్నది అనుకున్నట్లే అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖకు కొన్ని కార్యాలయాలను, కర్నూలుకు విజిలెన్స్ కమీషనరేట్ తో పాటు  కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను తరలిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఈ రెండు ఆదేశాలపై ప్రత్యర్ధులు కోర్టుకెక్కటంతో న్యాయస్ధానం కూడా చాలా తీవ్రమైన హెచ్చరికలు చేసింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విజిలెన్స్ కమీషనరేట్, కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు హై కోర్టుకు సంబంధమే లేదు. జగన్ చెప్పింది కర్నూలులో హై కోర్టును ఏర్పాటు చేస్తానని మాత్రమే. హైకోర్టు అన్నది ప్రత్యేక న్యాయ వ్యవస్ధ. విజిలెన్స్ కమీషనర్ కార్యాలయం, కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలు ప్రభుత్వంలో ఓ భాగం. ఈ రెండు కార్యాలయాలు సచివాలయం ఎక్కడుంటే అక్కడే ఉండాలి. అంటే ఇంత చిన్న విషయం కూడా తెలీకుండానే రెండు కార్యాలయాలను కర్నూలుకు బదిలీ చేస్తు ఆదేశాలు వచ్చాయా ? జగన్ కు తెలీకపోతే చెప్పటానికి అంతమంది  ఐఏఎస్ అధికారులున్నారు కదా ? వాళ్ళంతా ఏమి చేస్తున్నట్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి: