గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలని ఎండగడుతూ పలువురు జర్నలిస్టులు కాలమ్స్ రాస్తున్నారు. మూడు రాజధానుల విషయం కావచ్చు, ఇసుక గురించి కావచ్చు, ఇంకా ఇంగ్లీషు మీడియం గురించి కావచ్చు.. ఇలా పలు అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రోజుకో వార్త జాతీయ మీడియాలో పడుతూనే ఉంది.

 

 


జగన్ ప్రభుత్వ విధానాలని విమర్శించిన వారిలో ముఖ్యులుగా కనిపించిన వారు శేఖర్ గుప్తా. ఇమ్డియన్ ఎక్స్ ప్రెస్ కి చెందిన ఈ కాలమిస్టు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలని ఎద్దేవా చేస్తూ, అవి పనికిరానివని చెప్తూ కాలమ్స్ రాసాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా జగన్ పై ఎన్ని విమర్శలు చేస్తున్న వాటిని తిప్పికొట్టేందుకు తమకి అనుకూలమైన మీడియా కూడా ఉండడంతో ఆ విమర్శలు ఎక్కువ హాని చేయలేదు.

 

 

కానీ జాతీయ మీడియాలో ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తూ కాలమ్స్ రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రశ్నలు నేషనల్ లెవెల్ లో తమకి హానికలిగించేదిగా ఉన్నాయని భావించి ఉండవచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా జాతీయ మీడియాలో తమకి అనుకూలంగా వార్తలు రావడమనేకి కీలకం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పభుత్వానికి అనుకూలంగా హిందూ కాలమిస్టు కే ఎన్ రామ్ వ్యాఖ్యలు చేశారు. 

 

 

ఆయన ప్రభుత్వ విధానాలైన ఇంగ్లీషు మీడియం, రివర్స్ టెండరింగ్, మూడు రాజధానులు మొదలగు అంశాలపై  పాజిటివ్ నోట్ లో చెప్తూ జగన్ ప్రభుత్వానికి నేషనల్ మీడియాలో ఒక పాజిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కే ఎన్ రామ్ చేసిన దాన్ని చూస్తుంటే శేఖర్ గుప్తాకి కౌంటర్ లా కనిపిస్తోంది. ఏది ఏమైతేనేం జగన్ ప్రభుత్వానికి నేషనల్ మిడియాలో అనుకూల పవనాలు వీయడం అత్యంత ఆవశ్యకం.

మరింత సమాచారం తెలుసుకోండి: