జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు మేలు ఎంత చేస్తున్నారో...అంతకంటే ఎక్కువ స్థాయిలో బాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని పనిగట్టుకుని మరి చంద్రబాబు విమర్శించడం చేస్తున్నారు. గత 8 నెలలుగా అదే చేస్తూ వస్తున్నారు. ఇసుక, ఇంగ్లీష్ మీడియం, పోలవరం రివర్స్ టెండరింగ్, పి‌పి‌ఏలపై పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇక మూడు రాజధానులపై గత రెండు నెలలుగా కుళ్ళు రాజకీయం చేస్తున్నారు.

 

ఇక బాబుకు అనుకూల మీడియా అయిన యెల్లో మీడియా కూడా అదే పనిగా విష ప్రచారం చేస్తుంది. అయితే బాబు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నేషనల్ స్థాయిలో మీడియాని మేనేజ్ చేసి, జగన్ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విష ప్రచారం చేయించారు. ఇసుక, అమరావతి, పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లు... తాజాగా మూడు రాజధానులు లాంటి వాటిపై జాతీయ మీడియా వైసీపీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింది. ఇదంతా బాబు వెనుకుండే చేయించారని టాక్ కూడా వచ్చింది. అధిక స్థాయిలో ఫండ్స్ ఇచ్చి మరి నేషనల్ మీడియాని మేనేజ్ చేసినట్లు తెలిసింది.

 

ఇక ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి కియా నుంచి వెళ్లిపోతుందని వార్తలు రాయించి జగన్ సర్కార్‌పై బాబు అతి పెద్ద కుట్రకు తెరలేపారని తెలిసింది. కియా మోటార్స్... ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంతో చర్చిస్తోందనీ, రూ.7387 కోట్ల విలువైన ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించే ఆలోచనలో ఉందనీ రాయిటర్స్ సంస్థ సంచలన కథనం ఇచ్చింది. ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన మార్పులు, 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అనే పాలసీ తీసుకురావడమే ఇందుకు కారణమని కథనంలో పేర్కొంది.

 

ఇదివరకే నేషనల్ మీడియాలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు పాలసీపై జగన్ ప్రభుత్వం వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు దాని కారణంగానే కియా వెళ్లిపోతుందని వార్త వచ్చింది. మొత్తం మీద చూసుకుంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉందని అనుమానాలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: