ప్రపంచ దేశాలను ప్రస్తుతం కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 31 దేశాలకు కరోనా వైరస్ పాకగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తితో సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వైరల్ అవుతున్నాయి. వెబ్, సోషల్ మీడియాలో కరోనా గురించి వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు వైరల్ అవుతున్న వార్తలను నిజమని నమ్మి ఆ వార్తలను ప్రచారం చేస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్ అవుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుడు సమాచారాన్ని నియంత్రించటం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తోంది. చాలా మంది పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ పెంపుడు జంతువుల ద్వారా కుక్కలు, పిల్లుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. 
 
జంతువుల మాంసాన్ని తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. కానీ జంతువుల మాంసం తినడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి జరగదు. కేవలం గాలిద్వారా లాలాజలం ద్వారా మాత్రమే ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది. జంతువుల మూలాల నుండి ఈ వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. చైనా నుండి లెటర్లు, ప్యాకేజీలు తీసుకున్నా వాటి ద్వారా వైరస్ వ్యాప్తి జరగదు. 
 
కరోనా వైరస్ ను తగ్గించడానికి ఎలాంటి మందులు అందుబాటులో లేవు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను మాత్రం తగ్గించవచ్చు. ఈ వైరస్ సోకకుండా ఉండటానికి సురక్షితమైన మాస్కులను ముఖానికి తొడుక్కోవటం, ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే వారికి దూరంగా ఉండటం, శుభ్రమైన ఆహార పదార్థాలను తీసుకోవడం చేయాలి.                              

మరింత సమాచారం తెలుసుకోండి: