కేజ్రీవాల్.. సామాన్యుడు.. అలాంటి సామాన్యుడు దేశ రాజధానికి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఆశ్చర్యం వెయ్యదు.. ఎన్నో సంవత్సరాలు అక్కడ ఒకే పార్టీ రాజ్యం ఏలేది.. అలాంటి పార్టీని మట్టి కార్పించాడు ఈ సామాన్యుడు. 'ఆమ్ ఆద్మీ పార్టీ'ని స్థాపించి అందరూ సామాన్యులు తమ పార్టీగా భావించి కనీవినీఎరుగని రీతిలో ఢిల్లీలో ఘన విజయం సాధించారు. 

 

అయితే ఈసారి కూడా కేజ్రీవాల్ ఏ అధికారంలోకి వస్తాడు అని ముందస్తు సర్వేలు చెప్తున్నాయి.. కానీ కేజ్రీవాల్ నుండి ఎలైన సరే అధికారం లాగేసుకోవాలి అని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇంకా కాంగ్రెస్ అయితే కేవలం అంటే కేవలం ఒక్క చోట గెలిచినా గొప్పే అని చెప్తున్నారు సర్వే చేసినవారు. 

 

ఇంకా అది ఆలా పక్కన పెడితే.. కేజ్రీవాల్ ఓ సామాన్యుడు.. ముఖ్యమంత్రి అయినా అతను ఎప్పుడు అనవసర ఖర్చులు చెయ్యలేదు.. అనవసర ఆర్భాటాల జోలికి వెళ్ళలేదు.. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున మంత్రులుగా పనిచేసిన వారు కూడా సామాన్యులే.. వారు కూడా అంతే.. కేజ్రీవాల్ కు ఏ మాత్రం తీసిపోరు. 

 

ఇంకా అలాంటి వారిపై బీజేపీ చేసిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు.. అవకాశం వస్తే చాలు ఆ పార్టీ వారిని తొక్కేయాలని చూస్తారు.. అవినీ ఆరోపణల్ని చేస్తారు.. కానీ వాటి అన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు కేజ్రీవాల్. ఇంకా బీజేపీ ఢిల్లీలో అష్టకష్టాలు పడిన సరే గెలవలేదు ఎందుకంటే కేజ్రీవాల్ క్రేజు కేవలం ఢిల్లీ వరుకే లేదు.. దేశం మొత్తం ఉంది. 

 

అయినా సరే ఇప్పుడు ఢిల్లీకే అయన పరిమితం కనుక అయనకు ఢిల్లీలో ఎందుకు అంత క్రేజ్ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే.. మెట్రోరైల్‌లో మహిళా ప్రయాణీకులకు రాయితీలు.. అనేక పీపుల్స్‌ ఫ్రెండ్లీ కార్యక్రమాలు కేజ్రీవాల్ చేశారు. అవే ఆయనకు మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. అందుకే అయన ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారు అని సర్వేలు చెప్తున్నాయి.. మరి చివరికి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: