కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు అన్ని గడగడ లాడుతూ ఉన్నాయి. మొదట్లో ఈ వైరస్ కేవలం చైనాకు మాత్రమే పరిమితం అనుకున్నా క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా మన దేశంలో హైదరాబాదులో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వైరస్ బారిన పడినట్టుగా అనుమానం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా బయట పడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అనేక మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి నమూనాలను సేకరించి పరీక్షలకు కూడా పంపించారు. దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది.

 

 రిపోర్ట్స్ వస్తే గాని ఏ విషయం క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడమేల్డు ఇక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైరస్ కు సంబంధించి ఓ లేక బయటపడడం సంచలనం రేకెత్తిస్తోంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ గాంధీ ఆసుపత్రి సూపరెండెంట్ కు రాసిన లేఖ వైరల్ గా మారింది.ఆరు నెలల పాపకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెబుతూ గాంధీ ఆసుపత్రికి రెఫెర్ చేసింది ఆ ప్రైవేట్ ఆసుపత్రి. అయితే ఆ పాపకు పరీక్షలు చేయాలా వద్దా అనే విషయంపై గాంధీ ఆసుపత్రి వైద్యులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితులు చాలా మంది చికిత్స పొందుతున్నారు.


 చైనా నుంచి వచ్చిన మరో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్టు అనుమానం రావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రిలో చేరిన వారిలో తొమ్మిది మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ధృవీకరిస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వీరికి ప్రత్యేక బృందాల ద్వారా చికిత్స అందిస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: