ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ సంచలన నిర్ణయం పై ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వైసీపీ నేతలు అందరూ కట్టుబడి ఉంటున్న విషయం తెలిసిందే. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న వైసీపీ నేతలు అందరూ మద్దతుగా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాలు కు పలువురు వైసీపీ నేతలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అధినేతకు ఎదురు చెప్పలేక జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. 

 


 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుంచి రాజధాని మార్పు నిర్ణయం వల్ల అమరావతి ప్రాంతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ జగన్ నిర్ణయానికి సమర్ధించారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వైసిపి పార్టీ లోని ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ పార్టీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యే పదవులు ఆశించి... పార్టీ నుంచి టికెట్ రాని వారు కూడా చాలామంది ఉన్నారు. వీరందరికీ ఏదోవిధంగా ఎమ్మెల్యే హోదా ఉండే ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టేందుకు  గతంలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. 

 

 ప్రస్తుతం జగన్ శాసనమండలి రద్దు  నిర్ణయంతో కొంత మంది వైసీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు అంటూ ఆంధ్ర రాజకీయాల్లో  చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవిలు అయిన వస్తాయని ఆశపడిన వారికి ప్రస్తుతం శాసనమండలి రద్దు  ఏ పదవి రాకుండా అయిపోయింది. అయితే ఇలా జగన్ నిర్ణయంతో  అంతా అయోమయం లో పడిన వైసీపీ నేతల్లో  జగన్ కు  అత్యంత సన్నిహితులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నేతలు ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ శాసన మండలి రద్దు  ద్వారా వారికి ఎమ్మెల్యే పదవులు కూడా దక్కకుండా పోయాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు నిర్ణయం తో టీడీపీ కంటే వైసీపీ పార్టీకి నష్టం ఎక్కువగా వాటిల్లుతుందని... పలువురు వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇన్ని రోజుల వరకు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశించిన వారందరికీ జగన్ ఎలా న్యాయం చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: