వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కియా మోటార్స్ సంస్థ ఏపీ నుండి తమిళనాడుకు వెళుతుందంటూ వస్తున్న వార్తల గురించి స్పందించారు. బుగ్గన మీడియాతో మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా కంపెనీ అధికారులతో మాట్లాడానని కియా తరలింపు గురించి వస్తున్న వార్తలు అబద్ధమని అన్నారు. కియా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదని ప్రచురించిన వార్తా కథనం నిజం కాదని స్పష్టత ఇచ్చారు. 
 
ఈ కథనం ఎవరో ఉద్దేశపూర్వకంగా రాయించారని అన్నారు. ఎవరో ఓర్చుకోలేక ఇలా చేస్తున్నారని బుగ్గన అన్నారు. సోషల్ మీడియాను, మీడియాను వాడుకొని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుగ్గన అన్నారు. అడిగినవన్నీ కియా పరిశ్రమకు ఇస్తున్నామని ఆ పరిశ్రమకు ఇస్తున్న వాటితో ఆ కంపెనీ ప్రతినిధులు ఎంతో సంతోషంగా ఉన్నారని బుగ్గన అన్నారు. 
 
వైజాగ్ నుండి ఒక కంపెనీని తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని ఆ వార్తలో కూడా ఎలాంటి నిజం లేదని చెప్పారు. కియా విషయంలో కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. కియా సంస్థకు పూర్తి సహకారం అందించామని బుగ్గన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలా అనవసర ప్రచారం తాము చేసుకోవటం లేదని వైసీపీ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. 
 
కియా సంస్థపై వస్తున్న వార్తలను ఆ సంస్థే ఖండించిందని ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని బుగ్గన అన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన బిల్లులను తాము చెల్లిస్తున్నామని బుగ్గన అన్నారు. ఈ దుష్ప్రచారానికి ఎవరు పాల్పడ్డారో వారిపై చర్యలు తప్పవని బుగ్గన స్పష్టo చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన కియా తరలింపు గురించి స్పష్టత ఇవ్వటంతో కియా తరలింపు గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది.                             

మరింత సమాచారం తెలుసుకోండి: